హైదరాబాద్: యువత చరిత్ర తెలుసు కోవాలని హీరో శ్రీకాంత్ అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటం… ఆ తర్వాత నేటి ఆధునిక భారతావని ప్రస్థానం ఎలా సాగిందన్నదానిపై నేటి తరం తెలుసుకోవాలని కోరారు హీరో శ్రీకాంత్. దానికి ఈ నెల 18న నిర్వహిస్తోన్న రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ మంచి ఈవెంట్ గా అభివర్ణించారు.
16 నుండి 35 సంవత్సరాల యువత దీనిలో పాల్గొన వచ్చని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ (ఖైరతాబాద్) డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సమక్షంలో మంగళవారం ఈ క్విజ్ కాంపిటీషన్ కు సంబందించిన పోస్టర్ ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. క్విజ్ లో పాల్గొనదలచిన వాళ్లు 7661899899 కు ఈ నెల 17 వరకు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రిఫరల్ కోడ్ లో ROHIN అని టైప్ చేయాలని కోరారు. క్విజ్ లో విజేతలకు మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ల్యాప్ టాప్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, మరిన్ని కన్సోలేషన్ బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది.