హైదరాబాద్ : ‘భరత్ అనే నేను’ సినిమా ఫేం, సినీ నటుడు రాహుల్ రామకృష్ణ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సు లో అడ్మిషన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా నటుడు రాహుల్ రామకృష్ణా గురువారం విశ్వవిద్యాలయానికి వచ్చారు. అడ్మిషన్ ప్రాసెస్ పూర్తి అయ్యాక వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వీసీ ప్రొ. చక్రపాణి నటుడు రాహుల్ ను అభినందనలు తెలుపుతూ బీ. ఏ. కోర్సు పుస్తకాలు అందించారు.
ఈ సందర్భంగా సినీ నటుడు రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ ఉన్నత విద్యను పూర్తి చేయలేకపోయిన వారికి, ఆర్ధిక పరమైన ఇబ్బందులతో విద్యాభ్యాసం కొనసాగించలేని వారికి, గృహిణులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక వరం అని పేర్కొన్నారు. ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా విద్య అనేది సమాజంలో ఆ మనిషికి ప్రత్యేక గుర్తింపును ఇస్తుందన్నారు. తాను ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేశానని, తిరిగి డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చేరానన్నారు.
ఇది కూడ చదవండి-
ఇటీవల కాలంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి తీసుకుంటున్న నిర్ణయాలు తనను బాగా ఆకట్టుకున్నాయని ఆదివాసీ తెగలకు, ఆర్ధికంగా వెనబడిన వర్గాలకు, ట్రాన్స్ జెండర్ లకు ఉచిత విద్యను అందిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అభినందించదగ్గ విషయంగా పేర్కొన్నారు.
