సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన
మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు..మహిళ కాంగ్రెస్ నేతలు శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వం.. రాహూల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు సీఎం రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి..ప్రజాపాలన జిందాబాద్.. జై కాంగ్రెస్ నినాదాలతో దద్దరిల్లిన గాంధీభవన్
అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం మొగిలి సునీత రావు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు ఆధ్వర్యంలో గాంధీభవన్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి మరియు మంత్రివర్యులకు పాలాభిషేకం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరియు మహిళా ప్రయాణికులుకు బస్సులో మిఠాయిలు పంచి ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
[इच्छुक ड्रामा प्रेमी 12 जनवरी 2025 को मंचित होने वाले शो के टिकटों और अन्य जानकारी के लिए मोबाइल नंबर 93460 24369 पर संपर्क कर सकते हैं]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన విజయోత్సవాల వేడుకలు పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి హయాంలో నిరుపేద కుటుంబాలకు కార్పొరేటర్ స్థాయిలో వైద్యం అందజేయడం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ముఖ్యంగా మహిళలకు రైతులకు యువకులకు పెద్ద పీట వేస్తుందని సునీత రావు అన్నారు. ఇటు బిజెపి వాళ్లకు అటు బిఆర్ఎస్ వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక తిక్కతికగా మాట్లాడుతున్నారని పది సంవత్సరాలు మీరు చేసింది ఏముందని ప్రశ్నించారు.
यह भी पढ़ें-
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ప్రెసిడెంట్ పుస్తకాల కవిత ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభు ఉషశ్రీ మేడ్చల్ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జయమ్మ స్టేట్ ఆఫీసు బేరర్స్ బ్లాక్ ప్రెసిడెంట్స్ డివిజన్ ప్రెసిడెంట్స్ మొదలగు వారు పాల్గొన్నారు