Zindabad! Zindabad!! PRSI Zindabad!!! హైదరాబాద్ చాప్టర్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ చాప్టర్ అవార్డు

హైదరాబాద్ : పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ కు జాతీయస్థాయిలో బెస్ట్ చాప్టర్ అవార్డు లభించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన 44వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో గౌరవ మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మంగు భాయ్ పటేల్ చాప్టర్ చైర్మన్ డా. పి. వేణు గోపాల్ రెడ్డి కీ ఈ అవార్డును ప్రదానం చేశారు.

కార్యక్రమానికి పీఆర్‌ఎస్‌ఐ జాతీయ అధ్యక్షుడు డా. అజిత్‌ పాఠక్‌ అధ్యక్షత వహించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి వై. బాబ్జి, దక్షిణ భారత ఉపాధ్యక్షులు యు. ఎస్. శర్మ, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ఇందులో పాల్గొన్నారు.

కాగా జాతీయ స్థాయిలో ఉత్తమ కార్యదర్శి అవార్డు పి. మోహన్ రావుకు దక్కగా, బెస్ట్ లీడర్షిప్ అవార్డు డి. వి. సుబ్బా రావుకి, దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది డెలిగేట్లు పాల్గొన్న చాప్టర్ గా హైదరాబాద్ అవార్డుని దక్కించుకుంది.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి కంభంపాటి యాదగిరి, పి. మోహన్ రావు, కృష్ణ భాజీ, మధు వాకిటి, కె. ఆర్. కె. చారి, శ్రీకర్ రెడ్డి, రాజేష్ కళ్యాణ్, అపర్ణ రాజన్స్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X