PVTGs సభ్యులతో మరియు విద్యార్థులతో స్వయంగా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కోసం చేపడుతున్న ప్రయోజనాలపై ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల (PVTGs) అభివృద్ధి పై రాష్ట్రపతి నిలయంలో సమీక్ష.

విద్య, వైద్యం, సాగు,తాగునీరు కనీస మౌలిక సదుపాయాలపై ర్ ఆరా.

PVTGs కోసం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ వీడియో ప్రజెంటేషన్.

గిరిజనుల కోసం ప్రత్యేకంగా వైద్య,విద్య, రోడ్లు, విద్యుత్, రైతుబంధు, మిషన్ భగీరథ, కళ్యాణ్ లక్ష్మి అమలు చేస్తున్నట్లు వెల్లడించిన అధికారులు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి సంక్షేమంపై సంతృప్తికి వ్యక్తం చేసిన రాష్ట్రపతి.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

హైదరాబాద్ : బొల్లారం, రాష్ట్రపతి నిలయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కోసం చేపడుతున్న ప్రయోజనాలపై ప్రత్యేకించి బలహీన గిరిజన సమూహాల (PVTGs) అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. PVTGs సభ్యులతో మరియు విద్యార్థులతో స్వయంగా రాష్ట్రపతి మాట్లాడి వారికి అందుతున్న విద్య, వైద్యం, సాగు,తాగునీరు కనీస మౌలిక సదుపాయాలపై అరా తీశారు.

ఈ విషయాలపై pvtgs సభ్యులు మరియు విద్యార్థులు రాష్ట్రపతికి సమూలంగా వివరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల కోసం ప్రత్యేకించి PVTGs కోసం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ వీడియో ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రంలో 10 గిరిజన తెగలైన లంబాడాలు, కోయలు, గోండులు, ఎరుకల, పర్దానులు, ఆంధులు మరియు ఆదిమ జాతి తెగలయిన కొలాములు, చెంచులు, తోటి మరియు కొండారెడ్డి తేగలు ఉన్నాయి. రాష్ట్రంలో నాలుగు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 9 జిల్లాలో షెడ్యూల్ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. వీటిలో షెడ్యూల్ మండలాలు మరియు 3146 గిరిజన గ్రామపంచాయతీలు ఉన్నాయి.

వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రైతుబంధు ద్వారా 8.5 లక్షల మంది గిరిజనులకు ఇప్పటివరకు 7,349 కోట్ల రూపాయలను వ్యవసాయ పెట్టుబడి సహాయం అందించడం జరిగింది. అంతేకాకుండా 6 లక్షల8 వేల గిరిజన ఆవాసులకు మిషన్ భగీరథ పథకం ద్వారా త్రాగునీరు అందుతుంది. గిరిజనుల ఆరోగ్య వసతుల కోసం 437 సబ్ సెంటర్లు, 32 బర్త్ వేటింగ్ రూములు, 7 డయాగ్నొస్టిక్ హబ్బులను నిర్మించడం జరిగింది. ఆదిమ గిరిజన తెగల ప్రాంతాలలో 31 పాఠశాలలు, కోలముల కొరకై ప్రత్యేకించి ప్రైమరీ పాఠశాలలు, సైనిక్ పాఠశాల, న్యాయవిద్య కోసం ఫైన్ ఆర్ట్స్ కొరకు ప్రత్యేక కళాశాలు, ఏర్పాటుతోపాటు దివ్యాంగుల కొరకు ప్రత్యేక పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది.

ఇప్పటివరకు 918 గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశాలకు పొందారు. అంతేకాకుండా సీఎం ఎంటర్ ప్రెన్యూర్ పథకం కింద 205 మంది యువతకు ఎనిమిది విభాగాల్లో సహకారం అందించడం జరిగింది. ఇందులో ఐదుగురు ఆదిమ గిరిజన తెగలకు చెందిన వారు ఇద్దరు చేంచులు ఇద్దరు తోటీలు మరియు ఒక కోలము వారు ఉన్నారు. 1.4 లక్షల గిరిజన యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,126 కోట్ల ఆర్థిక సహాయం అందించబడింది.అటవీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ చెంచు కోలములకు, కొండారెడ్డి తెగల ఉత్పత్తులపై ప్రభుత్వ సహకారం అందించడం జరుగుతుంది. 440 ఆదిమ జాతి గిరిజన గ్రామాలలో 60 కోట్లతో ఇంటర్నల్ రోడ్ల సదుపాయం, 53 ఆదిమ జాతి ఆవాసాలలో 2.39 కోట్లతో సోలార్ విద్యుదీకరణ చేపట్టి 443 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది.

3467 గిరిజన గ్రామాలకు 221 కోట్లతో త్రీఫేజ్ విద్యుదీకరణ అందించబడుతుంది. గిరిజన గ్రామ పంచాయతీలకు గ్రామపంచాయతీ భవనాలు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 3275 కోట్లతో 5,162 కిలోమీటర్ల రహదారులను నిర్మించాం. 16,375 ఆదిమ జాతి పిల్లలు గర్భిణీలు మరియు బాలింతలకు కౌమార దశలో ఉన్న అమ్మాయిలకు గిరి పోషణ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి అనేక కార్యక్రమాలను pvtgs కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అందిస్తుంది అనే విషయాలను రాష్ట్రపతికి సమూలంగా వివరించడం జరిగింది.

అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలపై సంతృప్తి వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X