పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడుతో కలిసి హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకున్న MP రవిచంద్ర, నాగేశ్వరరావు

హైదరాబాద్ : అతిథులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతం, పలువురు ప్రజాప్రతినిధులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,నామా నాగేశ్వరరావులు మంత్రి వీ. శ్రీనివాస్ గౌడుతో కలిసి హెలికాప్టర్ ద్వారా శనివారం ఉదయం కల్లూరు చేరుకున్నారు.హెలిప్యాడ్ వద్ద వీరికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతం, ఖమ్మం నగర పోలీసు కమిషనర్ విష్ణు వారియర్ తదితర ప్రముఖులు పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు.

ఎంపీ రవిచంద్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్,లోకసభ సభ్యులు నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వెంకటవీరయ్యలతో కలిసి కల్లూరులో మినీ స్టేడియాన్ని ప్రారంభించారు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ మినీ ఇండోర్ స్టేడియాన్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి ప్రారంభించారు.స్టేడియంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి క్రీడాకారులతో కొద్దిసేపు ముచ్చటించారు.అటుతర్వాత జరిగిన సభలో ఎంపీలు రవిచంద్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్,నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ గౌతం తదితర ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు.ఈ సభకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు,క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

వేంసూరు మండలం వెంకటాపురంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, నాగేశ్వరరావు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలంలోని వెంకటాపురంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,ఎంపీ బండి పార్థసారథి రెడ్డిలతో కలిసి అతిథిగా హాజరయ్యారు.స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, యువత, గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ఈ సమ్మేళనానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమా మహేశ్వరరావు, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

వెంకటాపురంలో జయరాంరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్,ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు

రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి తోడల్లుడు, ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురంకు చెందిన భీంరెడ్డి వెంకట జయరాంరెడ్డి చిత్రపటానికి మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,నామా నాగేశ్వరరావులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.ఆయన ఈనెల 20వ తేదీన అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.వెంకటాపురంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి అతిథులుగా హాజరై, అటుతర్వాత రవిచంద్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో తన సహచర సభ్యులు పార్థసారథి రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి జయరాంరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.జయరాంరెడ్డి కొడుకు మురళీధర్ రెడ్డి,కుటుంబ సభ్యులు, పార్థసారథి రెడ్డి బంధుమిత్రులను వారు పరామర్శించారు.ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడుతో కలిసి హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకున్న ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు

అతిథులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతం, పలువురు ప్రజాప్రతినిధులు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,నామా నాగేశ్వరరావులు మంత్రి వీ.శ్రీనివాస్ గౌడుతో కలిసి హెలికాప్టర్ ద్వారా శనివారం ఉదయం కల్లూరు చేరుకున్నారు.హెలిప్యాడ్ వద్ద వీరికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతం, ఖమ్మం నగర పోలీసు కమిషనర్ విష్ణు వారియర్ తదితరులు ఘన స్వాగతం పలికారు.అటుతర్వాత ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వెంకటవీరయ్యలు శ్రీనివాస్ గౌడుతో కలిసి కల్లూరులో గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియాన్ని ప్రారంభించి,అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎంపీ రవిచంద్ర ఇతర అతిథులతో కలిసి పాల్గొన్నారు.అనంతరం వేంసూరు మండలం వెంకటాపురంలో ఎమ్మెల్యే వెంకటవీరయ్య నాయకత్వాన జరిగిన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు రవిచంద్ర,పార్థసారథి రెడ్డి, నాగేశ్వరరావులు హాజరై ప్రసంగించారు.ఆ తర్వాత అతిథులంతా కలిసి సత్తుపల్లి మండలం గంగారంలో నెలకొల్పిన సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

సత్తుపల్లి పర్యటన ముగించుకుని హైదరాబాద్ పయనమైన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు రవిచంద్ర పార్థసారథి రెడ్డి, నాగేశ్వరరావులకు వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో అధికార పర్యటన ముగించుకుని హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరిన మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి,నామా నాగేశ్వరరావులకు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీడ్కోలు పలికారు.హైదరాబాద్ నుంచి మంత్రి,ఎంపీలు హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకుని మొదట గ్రీన్ ఫీల్డ్ మినీ ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించి, అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు.అనంతరం వేంసూరు మండలంలోని వెంకటాపురంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై, పార్థసారథి రెడ్డి తోడల్లుడు,ఆ గ్రామానికి చెందిన జయరాం రెడ్డి ఇటీవల మృతి చెందగా,ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అటుతర్వాత అతిథులు మధ్యాహ్న భోజనం ముగించుకుని సత్తుపల్లి మండలం జీ.గంగారంలో సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం సత్తుపల్లి పట్టణంలోని జలగం వెంగళరావు స్మారక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణకు చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ పయనమయ్యారు.ఈ సందర్భంగా మంత్రి,ఎంపీలకు ఎమ్మెల్యే వెంకటవీరయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు వీడ్కోలు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X