నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

हैदराबाद: एक प्रमुख अंग्रेजी पत्रिका द्वारा आयोजित एक सम्मेलन में भाग लेने के लिए बीआरएस एमएलसी कल्वकुंट्ला कविता चेन्नई आई है। इस दौरे के दौरान एमएलसी कविता ने प्रसिद्ध अभिनेता और फिल्म नायक अर्जुन सरजा द्वारा निर्मित हनुमान मंदिर का दौरा किया और विशेष पूजा की। अर्जुन दम्पत्ति ने कविता का जोरदार स्वागत किया।

హైదరాబాద్ : ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నైలో పర్యటిస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రముఖ నటుడు సినీ హీరో అర్జున్ సర్జ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్జున్ దంపతులు కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ… చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, అక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి భాష చరిత్ర వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు.

ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు. దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X