Twitter War: అప్పుడు ఎక్కడున్నావ్? రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్

రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్

మహిళలు, బతుకమ్మ, బోనాలను కించపరిచడంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

శ్రీమతి సోనియా గాంధీ గారు మరియు ప్రియాంక గాంధీ గారి ద్వారా బతుకమ్మ ఎత్తించినా, బతుకమ్మ పేరు ఉచ్చరింపేలా చేసినా అది తెలంగాణ ఆడబిడ్డల ఘనతే- ఎమ్మెల్సీ కవిత

Hyderabad: చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారుల పై “తుపాకీ” ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం, బోనం మరియు బతుకమ్మకు పరిమితం చేస్తూ మాట్లాడడం మహిళల పట్ల మీ పార్టీకి ఉన్నగౌరవాన్ని తెలియజేస్తోంది.

శ్రీమతి సోనియా గాంధీ గారు మరియు ప్రియాంక గాంధీ గారి ద్వారా బతుకమ్మ ఎత్తించినా, బతుకమ్మ పేరు ఉచ్చరింపేలా చేసినా అది తెలంగాణ ఆడబిడ్డల ఘనతే.

మిలియన్ మార్చ్, సాగరహారం, అసెంబ్లీ ముట్టడిలో మేము ఆడబిడ్డలము ముందున్నాము, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఎక్కడంటూ ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత.

వంటావార్పులో పప్పన్నం తినడమే… బతుకమ్మ ఆడటమే… బోనం కుండలు ఎత్తడమే… త్యాగాలు అనుకుంటే తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలను ఏమనాలి అని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ ద్వారా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. త్యాగాలు ఒకరివైతే.. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే ఎలా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కి కల్వకుంట్ల కవిత రివర్స్ కౌంటర్ ఇచ్చారు. దానినికి కవిత ఈ రోజు కౌంటర్ ఇచ్చారు. 

Revanth Reddy Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X