సీఎం కేసీఆర్ వచ్చాకే తండాల్లో మహిళల గోస తీరింది: ఎర్రబెల్లి దయాకర్ రావు

కరెంట్ కష్టాలు తీరాయి… 24 గంటల కరెంట్ వస్తుంది

మోటార్లకు మీటర్లు పెట్టమని బిజెపి ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంటే…నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టనన్న మహానుభావులు సీఎం కేసీఆర్

మీ దయ వల్లే మంత్రి అయ్యాను…అన్ని విధాలా అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాను

వెలికట్టె గ్రామం అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక, కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తండాల్లో మహిళల నీటి గోస తీరిందని, గ్రామాల్లో కరెంటు కష్టాలు తప్పాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.

మహబూబాద్ జిల్లా, తొర్రూరు మండలం, వెలికట్ట గ్రామంలో నేడు దాదాపు కోటి రూపాయల విలువైన సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ , అవెన్యూ ప్లాంటేషన్ వంటి అభివృద్ధి పనులకు మంత్రిగారు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 8 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు…

“గత 8 ఏళ్లలో సీఎం కేసిఆర్ గారు ఏమి చేసారో ప్రజలు చూడాలి. వెలికట్టె గ్రామం మొదట ఎలా ఉండే..ఇప్పుడు ఎలా అభివృద్ది జరిగింది చూడాలి. తండాలో నీళ్ళు లేక గతంలో గోస ఉండేది…కానీ తెలంగాణ వచ్చాక మంచి నీళ్ళ కోసం మిషన్ భగీరథ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. అప్పట్లో కరెంట్ రాక, వచ్చినా ఎక్కువ, తక్కువగా ఉండి, మోటార్లు, స్టార్టర్ లు కాలి పోయేవి. అనేకంగా కరెంట్ కష్టాలు ఉండేవి. కానీ తెలంగాణ వచ్చాక 24 గంటలు కరెంట్ ఇచ్చిన మహానుభావులు సీఎం కేసిఆర్ గారు.

ఇప్పుడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టమంటున్నారు. మీటర్లు పెడితే 24 గంటల కరెంట్ కు లెక్క కడితే లక్ష రూపాయల బిల్లు అవుతుంది. కానీ సీఎం కేసీఆర్ గారు నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టనని అన్నారు. ఈ ఒక్క గ్రామానికి పెన్షన్లు ఏటా కోటి రూపాయిలు ఇస్తున్నాం. పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తున్నాం. కాంగ్రెస్ కాలంలో పదేళ్లలో ఇక్కడ 10 లక్షలు ఖర్చు చేయలేదు. కానీ కేసిఆర్ గారు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.

ఇంకా కోటి రూపాయలు పనులు చేయాల్సి ఉంది. మీ దయ వల్ల మంత్రి అయ్యాను…మీ రుణం తీర్చుకుంటాను. అందరికీ ఒకేసారి న్యాయం ఎవరూ చేయలేరు..కానీ దశల వారీగా అందరికీ న్యాయం జరుగుతుంది. కేసిఆర్ గారు వచ్చాక తెలంగాణ అభివృద్ది జరుగుతుంది. బతుకమ్మ ఘాట్ కోసం జాగ చూస్తే వెంటనే ఏర్పాటు చేద్దాం. పెళ్లి అయ్యాక బిడ్డకు కళ్యాణ లక్ష్మి చెక్కు వస్తే అల్లుడే తీసుకుంటాడు. కాబట్టి లగ్న కోటు వేసుకున్న కాగితం తెస్తే పెళ్లి లోపు కళ్యాణ లక్ష్మి చెక్ ఇప్పిస్తాను.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X