हैदराबाद: मालूम हो कि इस महीने की 12 तारीख को छत्तीसगढ़ के नारायणपुर जिले के वन क्षेत्र में एक बड़ी मुठभेड़ हुई थी। हालांकि, माओवादी पार्टी ने नारायणपुर मुठभेड़ को झूठ बताया है। इस आशय का पत्र माओवादी मंडलीय समिति की ओर से जारी किया गया है। पुलिस का यह दावा कि मुठभेड़ में सात नक्सली मारे गए। माओवादियों ने साफ किया है कि मुठभेड़ पूरी तरह से झूठ है और वह कोई मुठभेड़ नहीं थी। कहा कि सात मृतकों में से पांच ग्रामीण थे।
इस महीने की 10 से 13 तारीख तक नारायणपुर जिले के माड़ डिवीजन के इंद्रावती इलाके में कगार ऑपरेशन के तहत लगभग 4000 पुलिसकर्मियों और अर्धसैनिक बलों के जवानों के साथ फिर से एक बड़ा दमनकांडा चलाया गया। बताया गया कि 11 तारीख की सुबह करीब 11 बजे लकेवेदा पेंडा में खेती कर रहे लोगों को पुलिस वालों ने घेर लिया और उन पर अंधाधुंध फायरिंग कर दी। फायरिंग तीन या चार ग्रामीण मारे गए और सात घायल हो गए। इसके बाद कई लोगों को पकड़कर ले गये।
वहीं, इसी महीने की 12 तारीख को कुम्मम जंगल में बीमार चल रहे पीएलजीए सदस्य कार्तिक दादा (62) और उनके सहायक रमी को पुलिस ने घेर लिया और गोली मार दी। पत्र में कहा है कि यह नरसंहार सुनियोजित था। माओवादी पार्टी ने फर्जी मुठभेड़ की न्यायिक जांच और जिम्मेदार पुलिस अधिकारियों के खिलाफ कार्रवाई की मांग की है।
यह भी पढ़ें-
ఆ ఎన్‌కౌంటర్ బూటకం, లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్‌లోని అటవీప్రాంతంలో ఈ నెల 12న భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే నారాయణపూర్ ఎన్‌కౌంటర్ బూటకమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ మేరకు డివిజనల్ కమిటీ పేరిట ఓ లేఖ విడుదల చేసింది. ఏడుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నది పూర్తిగా అబద్ధమని, ఇది ఎన్‌కౌంటర్ కాదని స్పష్టంచేసింది. మృతులు ఏడుగురిలో ఐదుగురు గ్రామీణులు ఉన్నారని తెలిపింది.
ఈ నెల 10 నుంచి 13 వరకు నారాయణపూర్ జిల్లా మాడ్ డివిజన్‌లోని ఇంద్రావతి ప్రాంతంలో కాగర్ ఆపరేషన్‌లో భాగంగా సుమారు 4వేల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందితో మళ్లీ పెద్ద దమనకాండ నిర్వహించారని తెలిపింది. 11వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో లకేవేద పెండలో వ్యవసాయం చేస్తున్న వారిని చుట్టుముట్టిన పోలీసులు వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని పేర్కొంది. ఇందులో ముగ్గురు లేదా నలుగురు గ్రామీణులు చనిపోయారని, ఏడుగురు గాయపడ్డారని వెల్లడించింది. చాలామందిని పట్టుకుని తీసుకెళ్లారని వెల్లడించింది.
మరోవైపు ఈ నెల 12న కుమ్మం అడవిలో అనారోగ్యంతో ఉన్న పీఎల్‌జీఏ సభ్యుడు కార్తీక్ దాదా(62), అతడి సహాయకుడు రమీలను పోలీసులు చుట్టుముట్టి కాల్చి చంపారని పేర్కొంది. ప్రణాళికాబద్ధంగా ఈ మారణకాండ జరిపారని లేఖలో పేర్కొంది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. (ఏజెన్సీలు)