హైదరాబాద్ : ఆసిఫాబాద్ లోని సత్య సాయి సేవా మందిరంలో తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు కవి యాత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కారం శంకర్ కి ఆ.క.సం. ఆసిఫాబాద్ కవుల సంగం వారు ఈ సంవత్సరం డాక్టర్ వనపర్తి తిరుపతి స్మారక పురస్కారాన్ని అందజేశారు. మెమెంటో అభినందన పత్రం నగదుతో సత్కారించారు.
ఈ సందర్భంగా కారం శంకర్ మాట్లాడుతూ ఇప్పటివరకు తాను పొందిన అన్ని పురస్కారాల్లో కెల్లా ఈ పురస్కారం విశిష్టమైనదని తెలిపారు. కవిత్వంలోని పాదాలు మనిషిని వెంటాడాలని అలాంటి కవిత్వం చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. ఇంతే కాదు కవిత్వం మనిషిని సంస్కరిస్తుంది. ఈ సభలో ప్రముఖ కవి టి. జ్యోతి వ్యాఖ్యానం సభికులను చాలా ఆకట్టుకుంది.
ఇది కూడ చదవండి-
కార్యక్రమంలో మిత్రులు అష్టావధాని మాడుగుల నారాయణమూర్తి, నల్లగొండ రమేష్, గుర్రాల వెంకటేశ్వర్లు, శ్రీరామ్ సత్యనారాయణ, మంచి కట్ల రాజయ్య, చిలుకూరి రాధాకృష్ణ చారి , మాడిశెట్టి శ్రీనివాస్, ఇందారపు మధుకర్ శర్మ, ఢిల్లీ విజయ్ కుమార్, మసాదే నాగోరావు, టి. జ్యోతి, దేవరాజురేవతి, కాచం సరిత, సాయిని శ్రీదేవి, కిల్లి వెంకట్రావు, భూపతి సంతోష్ కుమార్, లేదాళ్ళ రాజేశ్వరరావు, బి. విశ్వనాథ్, రావుల రామన్న, జాడి పెంటయ్య, బి. వెంకట్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ.క.సం .కు కృతజ్ఞతలు తెలిపారు.