अभिनेत्री जमुना के निधन पर कई राजनीतिक और टॉलीवुड हस्तियों ने शोक जताया, महाप्रस्थानम में अंतिम संस्कार

हैदराबाद : जमुना के निधन पर कई राजनीतिक और टॉलीवुड हस्तियों ने शोक जताया है।

హైదరాబాద్‌: సీనియర్ నటి, టాలీవుడ్ ‘సత్యభామ’ జమున మరణంతో తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దీంతో ఎంతోమంది రాజకీయ మరియు టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.

మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి సంతాపం

జమున మరణం తీరని లోటని మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి అన్నారు. మహా నటులతో కలిసి ఆమె నటించారన్నారు. పుట్టినిల్లు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారని చెప్పారు. మహానటులకు మరణం ఉండదని కొనియాడారు. జమున ఒక లెజెండ్  అన్నారు. అయితే ప్రస్తుతం మా ప్రెసిడెంట్ విష్ణు అందుబాటులో లేరని.. జమున అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చేయాలని కోరుతున్నామని చెప్పారు.

మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు

మధ్యాహ్నం 2 గంటలకు జమున పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ కు తరలిస్తారని చెప్పారు. అక్కడే 4 గంటల వరకు జమున భౌతికకాయాన్ని ఉంచుతామన్నారు. ఆ తర్వాత సాయంత్రం 5గంటలకు మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జమున కుమార్తె స్రవంతి ఆమె అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవి సంతాపం

‘సీనియర్ హీరోయిన్ జమున స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

బాలకృష్ణ సంతాపం

గతంలో జమున నటించిన సినిమాలను గుర్తుచేసుకుంటూ బాలకృష్ణ నివాళులర్పించారు. ‘అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు. చిన్ననాటి నుంచే నాటకాల్లో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాన్నగారు (ఎన్టీఆర్) అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు. ఈ రోజున జమున భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అంటూ బాలకృష్ణ నివాళులర్పించారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం

సీనియర్ నటి జమున గారి మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సంతాపం వ్యక్తం చేశారు.తెలుగు, కన్నడ ,తమిళ,హిందీ,భాషల్లో 150 చిత్రాల్లో నటించిన జమున గారు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకున్నారని ఆయన తెలిపారు.1980 లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా ఎన్నికై,జమున గారు ప్రజలకు ఎంతో సేవ చేసారని ఆయన తెలిపారు. జమున గారి కుటుంబ సభ్యులకు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తన సానుభూతిని వ్యక్తం చేశారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం

సత్యభామగా అందరి హృదయాల్లో పదిలమైన సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జమున మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పారు. నటిగా ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పనిచేసి విలక్షణమైన వ్యక్తిగా, రాజకీయ నేతగా ప్రజాభిమానం పొందారన్నారు. సీనియర్ నటులు వరుసగా చనిపోతుండటం సినీ పరిశ్రమకు తీరని లోటుగా అభివర్ణించారు. జమున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థించారు.

Related News:

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం

సినీ నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, మాజీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి జమున గారి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. జమున మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వివిధ భాషలలో వందలాది సినిమాలలో నటించడమే కాకుండా అగ్ర నటుల పక్కన నటించి తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జమున. జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని భాగవంతుణ్ణి కోరుకుంటున్నా.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ సంతాపం

• మాజీ ఎంపీ, సీనియర్ నటి, బీజేపీ నేత శ్రీమతి జమున మరణం బాధాకరం. తెలుగు సినీ రంగానికి తీరని లోటు.

• చలనచిత్ర రంగంలో లేడీ ఓరియంటెడ్ పిక్చర్స్ కు శ్రీకారం చుట్టిన వ్యక్తి శ్రీమతి జమున. మహిళా సమాజం అన్ని రంగాలలో ముందుండాలని, చైతన్యంతో ముందుకు సాగాలన్న వారి ఆలోచన విధానం, మహిళ సాధికారతకు నిలువెత్తు నిదర్శనం.

• శ్రీమతి జమున మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. శ్రీమతి జమునకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

పవన్ కల్యాణ్ సంతాపం

ప్రముఖ నటి, లోక్‌సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీమతి జమునగారు తెలుగు ప్రేక్షకులకు మాత్రం సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్‌సభ సభ్యురాలిగా సేవలందించారు. శ్రీమతి జమునగారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

– మహేశ్ బాబు సంతాపం

జమునగారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆమె చేసిన అన్ని ఐకానిక్ పాత్రలు, పరిశ్రమకు ఆమె చేసిన సేవని తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆమె కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి.

ఎన్టీఆర్ బాబు సంతాపం

దాదాపుగా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహారాణిలా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మలాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేశారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమునగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X