हैदराबाद : तेलंगाना के वरंगल बस स्टैंड स्थित पानी की टंकी तोड़ते समय एक मजदूर मलबे में दब गया और उसकी मौत हो गई। वरंगल बस स्टैंड के नवीनीकरण के हिस्से के रूप में, जीर्ण-शीर्ण पुराने बस स्टैंड को ध्वस्त करने का काम हाल ही में शुरू हुआ है। मंगलवार को टैंक तोड़ते समय दुर्घटनावश मलबा वहां मौजूद मजदूरों पर गिर गया। इससे मकान तोड़ने का काम करने आए बोंता रवि (40) नामक मजदूर की मौके पर ही मौत हो गई।
पुलिस ने बताया कि मृतक वरंगल जिले के खानापुरम मंडल के मनुबोतुलगड्डा का रहने वाला है। पांच साल बाद वह गरीबनगर आ गया और मजदूरी कर अपने परिवार का भरण-पोषण कर रहा था। मृतक को पत्नी और दो बेटे हैं। इंतजारगंज सीआई शिवकुमार ने बताया कि मामला दर्ज कर लिया गया है और जांच की जा रही है। आरोप है कि पानी की टंकी तोड़ने का काम कर रहे मजदूरों द्वारा वहां मौजूद मजदूरों को न्यूनतम सुरक्षा नहीं देने के कारण यह हादसा हुआ।
వరంగల్ బస్టాండ్‌లో వాటర్ ట్యాంక్ కూలి వ్యక్తి మృతి
హైదరాబాద్ : వరంగల్ (తెలంగాణ) బస్టాండ్‌లోని వాటర్ ట్యాంక్ కూల్చివేస్తుండగా శిథిలాల కింద పడి ఓ కూలి చనిపోయాడు. వరంగల్ బస్టాండ్ పునరుద్ధరణలో భాగంగా శిథిలావస్థకు చేరిన పాత బస్టాండ్ కూల్చివేత పనులు ఇటీవల ప్రారంభించారు. మంగళవారం ట్యాంక్ కూల్చివేస్తుండగా ప్రమాదవశాత్తు శిథిలాలు అక్కడున్న కూలీలపై పడ్డాయి. దీంతో కూల్చివేత పనుల కోసం వచ్చిన బొంత రవి(40)అనే కూలీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
మృతుడిది వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మనుబోతులగడ్డ. ఐదేండ్ల కింద గరీబ్ నగర్‌కు వచ్చి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇంతేజార్ గంజ్ సీఐ శివకుమార్ తెలిపారు. వాటర్ ట్యాంక్ కూల్చివేత పనులు చేస్తున్న సిబ్బంది అక్కడున్న కూలీలకు కనీస రక్షణ కల్పించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. (ఏజెన్సీలు)