టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 ప్రదానం

ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి సర్టిఫికేట్

YWCA లో ఈ రోజు 3 గంటల పాటు జరిగిన పరీక్షలో నెగ్గిన మహేష్ కుమార్ గౌడ్

ఒకవైపు ఎడతెరపి లేని రాజకీయాలు. అటు అధికార పార్టీ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రాజకీయ పనులు.. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా నిరంతరం ప్రజాసేవ.. అయిన కరాటే పై మక్కువ.

తన జీవితంలో కరాటే ఒక భాగం.. ఎంత వత్తిడి ఉన్న కూడా కరాటే కు సమయం కేటాయించే మహేష్ కుమార్ గౌడ్.

సమాజంలో క్రీడల పట్ల ఆసక్తి ఉండాలని సూచిస్తున్న మహేష్ కుమార్ గౌడ్.

హైదరాబాద్ : ఇప్పటి సమాజంలో తల్లిదండ్రులు పిల్లలను ఒక కంప్యూటర్ కిడ్స్ ల తయారు చేస్తూ మానసిక వత్తిడికి గురి చేస్తున్నారని.. క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని శారీరక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

తను ఎంత బిజీ ఉన్న కరాటే కు తప్పకుండా సమయం కేటాయిస్తానని కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ ఉపాధ్యక్షులుగా కరాటే పోటీల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నానని అన్నారు. ఈ రోజు కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికెట్ తీసుకోవడం నాకు గర్వంగా, సంతోషంగా ఉందని అన్నారు.

Also Read-

తాను కరాటే పోటీలలో పలు దేశాలలో పర్యటించానని ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ తదితర దేశాలలో ప్రతి ఇంటిలో ఒక క్రీడాకారుడు తప్పకుండా ఉంటారని అన్నారు.

పిల్లలు క్రీడలలో రాణిస్తే అన్ని విధాలుగా మంచిదని అన్నారు. తల్లిదండ్రులు క్రీడల పట్ల ప్రోత్సహించాలని అన్నారు. అందుకే గత నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ జాతీయ కరాటే పోటీలను నిర్వహించామని అన్నారు. భవిష్యత్ లో 2027లో ఆసియా కరాటే పోటీలు కూడా ఇక్కడే చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X