साइंस जिंदाबाद : मृत्यु के बिना जीवन, अगले सात वर्षों में संभव है!

नई दिल्ली/हैदराबाद : क्या मनुष्य के लिए अमरता संभव है? इस प्रश्न ने कई वैज्ञानिकों को सैकड़ों वर्षों से उलझाए रखा है। वैज्ञानिक दृष्टि से कोई यह नहीं कह सकता था कि मनुष्य के लिए अमरत्व संभव है। हाल ही में एक इंजीनियर ने कहा कि आदमी को जल्द ही अमरत्व प्राप्त होगा। रे कुर्ज़वील एक 75 वर्षीय पूर्व Google इंजीनियर, दृढ़ता से तर्क देते हैं कि 2030 तक मृत्यु के बिना जीवन संभव होगा। उन्होंने 147 भविष्यवाणियाँ की, जिनमें से 86 प्रतिशत सत्य हो गई और अब अमरत्व के दावे को अत्यधिक महत्व प्राप्त हो गया है।

अपने YouTube चैनल Adagio पर पोस्ट किए गए एक वीडियो में, रे ने खुलासा किया कि आनुवंशिकी, नैनोटेक्नोलॉजी, रोबोटिक्स आदि जैसी नवीनतम तकनीकों के साथ, अगले सात वर्षों में मनुष्य के लिए अमरता संभव हो जाएगी। उन्होंने भविष्यवाणी की कि नैनो तकनीक और रोबोटिक्स उम्र-उलटने वाले नैनोबॉट्स विकसित करेंगे, जो बढ़ती उम्र के साथ शरीर में क्षतिग्रस्त कोशिकाओं और ऊतकों को बहाल करेंगे और प्रतिरक्षा प्रदान करेंगे। उनका कहना है कि उम्र बढ़ने से रोकने वाले इन नैनोबॉट्स की वजह से इंसान के लिए अमरता संभव होगी।

खुद को फ्यूचरिस्ट कहने वाले कुर्जवील ने अतीत में इसी तरह की कई भविष्यवाणियां की हैं जो सच हुई हैं। उन्होंने 1990 में भविष्यवाणी की थी कि एक कंप्यूटर वर्ष 2000 तक दुनिया के सर्वश्रेष्ठ शतरंज खिलाड़ी को हरा देगा, और यह 1997 में सच हो गया। कुर्ज़वील ने 1999 में भविष्यवाणी की थी कि 2023 तक, 1,000 डॉलर का एक लैपटॉप मानव मस्तिष्क जितना शक्तिशाली होगा।

कई साल पहले कहा गया था कि 2010 तक पूरी दुनिया में हाई बैंडविथ वाला वायरलेस इंटरनेट उपलब्ध हो जाएगा। तकनीक के बारे में कुर्ज़वील की अधिकांश भविष्यवाणियाँ सच हुईं, उनके शब्दों को महत्व और विश्वसनीयता प्राप्त हुई। अब सबकी निगाहें उसकी इस भविष्यवाणी पर टिकी हैं कि आदमी नहीं मरेगा।

మరణం లేని జీవితం.. మరో ఏడేండ్లలో సాధ్యమే !

న్యూఢిల్లీ/హైదరాబాద్ : మనిషికి అమరత్వం సాధ్యమేనా? ఈ ప్రశ్న కొన్ని వందల ఏండ్లుగా ఎంతోమంది శాస్త్రవేత్తలను ఒక్కచోట నిలువనీయలేదు. శాస్త్రీయంగా మాత్రం మనిషికి అమరత్వం సాధ్యమని ఎవరూ చెప్పలేకపోయారు. తాజాగా ఓ ఇంజినీర్‌ మనిషికి త్వరలో అమరత్వం లభిస్తుందని చెప్తున్నారు. 2030 నాటికి మనిషికి మరణం లేని జీవితం సాధ్యమవుతుందని బలంగా వాదిస్తున్నారు 75 ఏండ్ల గూగుల్‌ మాజీ ఇంజినీర్‌ రే కర్జ్‌వీల్‌. ఈయన 147 అంచనాలు వేయగా ఇందులో 86 శాతం నిజం కావటంతో ఇప్పుడు అమరత్వం వాదనకు ఎక్కడలేని ప్రాధాన్యం ఏర్పడింది.

జెనెటిక్స్‌, నానోటెక్నాలజీ, రోబోటిక్స్‌ తదితర అత్యాధునిక సాంకేతికతలతో మరో ఏడేండ్లలోనే మనిషికి అమరత్వం సాధ్యమవుతుందని తన యూట్యూబ్‌ చానల్‌ అడాజియోలో పోస్ట్‌చేసిన వీడియోలో రే వెల్లడించారు. వయసును రివర్స్‌ చేయగలిగే నానోబోట్లను నానోటెక్నాలజీ, రోబోటిక్స్‌ అభివృద్ధి చేస్తాయని, ఇవి వయసు పెరుగుతున్నకొద్దీ శరీరంలో దెబ్బతినే కణాలు, కణజాలాలను పునరుద్ధరిస్తాయని, రోగ నిరోధక శక్తిని కల్పిస్తాయని ఆయన అంచనా వేశారు. వయసు మీద పడకుండా చేసే ఈ నానోబోట్ల వల్ల మనిషికి అమరత్వం సాధ్యం అవుతుందని ఆయన చెప్తున్నారు.

తనను తాను భవిష్యత్తువాదిగా చెప్పుకునే కర్జ్‌వీల్‌ గతంలో ఇలాగే వేసిన పలు అంచనాలు నిజమయ్యాయి. 2000 సంవత్సరం నాటికి ప్రపంచ అత్యుత్తమ చెస్‌ ప్లేయర్‌ను కంప్యూటర్‌ ఓడించగలదని 1990లో ఆయన అంచనా వేయగా అది 1997లో నిజమయ్యింది. 2023 నాటికి వెయ్యి డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌కు మనుషుల మెదడుకు ఉన్నంత శక్తిసామర్థ్యాలు ఉంటాయని కర్జ్‌వీల్‌ 1999లో అంచనా వేశారు.

2010 నాటికి ప్రపంచమంతా హై బ్యాండ్‌విడ్త్‌ వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుందని చాలా ఏండ్ల క్రితమే చెప్పారు. టెక్నాలజీకి సంబంధించి కర్జ్‌వీల్‌ అంచనాలు చాలా వరకు నిజం అవ్వడంతో ఆయన మాటకు ప్రాధాన్యం, నమ్మకం పెరిగాయి. దీంతో ఇప్పుడు మనిషికి చావు ఉండదనే ఆయన అంచనాపై అందరి దృష్టి పడింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X