ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Hyderabad: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పట్టణంలోయాదాద్రి భువనగిరి జిల్లాలో తన ఇంట్లో పనిచేసే మహేష్ అనే యువకుడి పెళ్లికి హాజరయ్యారు కవిత. నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. యాదాద్రిలో నిర్మించిన ఆలయం ఈ రోజు మన తెలంగాణకే కాకుండా యావత్ భారతదేశం మొత్తంతో ఎంతో సగర్వంగా చెప్పుకుంటుందన్నారు కవిత. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఆలయాను గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదని, కానీ సీఎం కేసీఆర్ గారు అద్బుతమైన టెంపుల్ సిటీని తీర్చిదిద్దారని తెలిపారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష

యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యమాల ఖిల్లా, టీఆర్ఎస్ పార్టీకి కంచు కోట అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఉద్యమంలో అయినా, ఎన్నికల్లో అయినా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు టీఆర్ఎస్ కు అండగా నిలబడ్డారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 2001 నుండి జడ్పీటీసీ స్థాయి నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ప్రజలు మద్దతు పొందారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఉద్యమ సమయంలో కూడా సమైక్య వాదులు ఉద్యమాన్ని ఆగం చేసిందుకు అనేక ప్రయత్నం చేశారని… అయినా మొక్కవోని దీక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపి గమ్యాన్ని ముద్దాడారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X