హైదరాబాద్ మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో  కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు, పోటెత్తారు అభిమానులు (H)

हैदराबाद: अभिनेता कैकाल सत्यनारायण का अंतिम संस्कार हैदराबाद के महाप्रस्थानम में तेलंगाना सरकार सम्मान के साथ किया गया। सत्यनारायण के उनके बेटे ने मुखाग्नि दी। अंतिम संस्कार में तेलंगाना सरकार की ओर से मंत्री एर्राबेल्ली दयाकर राव ने शिरकत की। सत्यनारायण को देखने के लिए प्रशंसकों का हुजूम उमड़ पड़ा।

హైదరాబాద్ : నటడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో హైదరాబాద్ మహా ప్రస్థానంలో జరిగాయి. సత్యనారాయణ పార్థివ దేహానికి ఆయన కుమారుడు నిప్పటించారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సత్యనారాయణని చూసేందుకు అభిమానులు పోటెత్తారు.

సత్యనారాయణ మహానటుడు ఎస్వీరంగారావు నట వారసుడిగా తెలుగు సినిమా స్వర్ణయుగ చరిత్రలో ఆయనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న విలక్షణ నటుడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఈ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 88 ఏళ్లు. 

సత్యనారాయణకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేసారు. కైకాల తిరిగిరాని లోకాలను వెళ్లారని తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలియజేసారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర, జగన్ ఈయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. 

చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు కైకాల సత్యనారాయణ. తెలుగుతెరపై ఒకదానితో ఒకటి సంబంధంలేని పాత్రలతో విలక్షణమైన నటనతో నవరస నటనా సార్వభౌముడు అనిపించుకున్నారు. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తరం వరకు అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు కైకాల సత్యనారాయణ.

ఆరు దశాబ్దాల సుధీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 777 చిత్రాల్లో పలు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. అటు ఎన్టీఆర్‌తో ఈయన దాదాపు 100 పైగా చిత్రాల్లో ఢీ అంటూ ఢీ అనే పాత్రలో నటించారు.అటు హిందీలో సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన ‘కర్మ’తో పాటు శ్రీరామవనవాస్ తో పాటు కన్నడ, తమిళ సినిమాల్లో విలక్షణ పాత్రలతో అలరించారు.

తెలుగు తెరపై తెరపై తండ్రి పాత్రలైనా… తాతా పాత్రలైనా, ప్రతినాయకుడి పాత్రలోనా, హాస్యనటుడిగా, సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక, కౌబాయ్ ఇలా అన్ని జానర్స్‌లో తనదైన మార్క్ నటనతో నటనతో ఆకట్టుకొని నవరస నటనా సార్వభౌముడిగా తెలుగు తెరను ఏలారు. ముఖ్యంగా యముడి పాత్ర అంటూ సత్యనారాయణ… సత్యనారాయణ అంటే యముడు అనేంతగా ఆ పాత్రలో తన ప్రత్యేకత చాటారు. ఈయన 1996లో తెలుగుదేశం తరుపున మచిలిపట్నం లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X