अंदेश्री के ‘जय जय हे तेलंगाना’ गीत का अनावरण 2 जून को, ऑस्कर पुरस्कार विजेता कीरवाणी करेंगे संगीत प्रदान

हैदराबाद: तेलंगाना सरकार ने पृथक तेलंगाना गठन आंदोलन के दौरान तेलंगाना समुदाय को एकजुट और मंत्रमुग्ध कर देने वाले ‘जय जय हे तेलंगाना…’ गीत के अनावरण करने का संकल्प लिया है। इस गीत का अनावरण 2 जून को तेलंगाना के गठन की 10वीं वर्षगांठ के अवसर पर किया जाएगा। सरकार पहले ही इसे तेलंगाना गीत घोषित कर चुकी है। गीतकार अंदेश्री, संगीत निर्देशक एमएम कीरवाणी और अन्य ने मंगलवार को हैदराबाद में मुख्यमंत्री रेवंत रेड्डी से उनके आवास पर मुलाकात की।

तेलंगाना की आत्मा, अस्तित्व, स्वाभिमान के प्रतीक और पूरी दुनिया में फैली सांस्कृतिक भव्यता को दर्शाने वाले अंदेश्री द्वारा लिखा गया यह गीत लगभग 6 मिनट लंबा है। सरकार ने इसमें कोई बदलाव किए बिना इसका अनावरण वैसे ही करने का फैसला किया है। हालाँकि, सीएम की मौजूदगी में यह निर्णय लिया गया कि गीत 60-90 सेकंड से अधिक लंबा नहीं होना चाहिए ताकि इसे सरकार और विदेशी गणमान्य व्यक्तियों के आधिकारिक कार्यक्रमों में इस्तेमाल किया जा सके। मुख्य गीत की भावनाओं को बरकरार रखने और लंबाई कम करने के लिए अंदेश्री को पूरी स्वतंत्रता, जिम्मेदारी और अधिकार दिया गया।

गीतकार अंदेश्री के सुझाव के अनुसार ऑस्कर पुरस्कार विजेता कीरवाणी को इसके लिए संगीत प्रदान करने की जिम्मेदारी सौंपी गई हैं। लेखक और संगीत निर्देशक ने मुख्यमंत्री से इस पर चर्चा की है। मुख्यमंत्री ने दो जून तक गीत तैयार करने का सुझाव दिया। इस मौके पर कीरवाणी और अंदेश्री को सीएम रेवंत रेड्डी ने सम्मानित किया।

यह भी पढ़ें-

‘జయ జయహే తెలంగాణ’

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆవిష్కరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే జూన్‌ 2కు తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించనుంది. ఇప్పటికే దీన్ని రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తదితరులు భేటీ అయ్యారు.

తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా అస్తిత్వానికి ప్రతీకగా ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందెశ్రీ రాసిన ఈ గీతం సుమారు 6 నిమిషాల నిడివి ఉంటుంది. అందులో మార్పులేమీ చేయకుండా యథాతథంగా ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, దేశవిదేశీ ప్రముఖులు హాజరైన సందర్భాల్లో వినియోగించడానికి వీలుగా గీతాన్ని 60-90 సెకన్ల నిడివి మించకుండా రూపొందించాలని సీఎం సమక్షంలో నిర్ణయించారు. ప్రధాన గీతంలోని భావోద్వేగాలను అలాగే కొనసాగిస్తూ నిడివి తగ్గించేందుకు అందెశ్రీకి పూర్తి స్వేచ్ఛ, బాధ్యత, అధికారం అప్పగించారు.

దీనికి సంగీతం అందించే బాధ్యతలను ఆస్కార్‌ పురస్కార గ్రహీత కీరవాణికి అప్పగిస్తే బాగుంటుందన్న అందెశ్రీ సూచనల మేరకు ఆయనను ఇందులో భాగస్వామిని చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రితో రచయిత, సంగీత దర్శకుడు చర్చించారు. జూన్‌ 2లోగా ప్రధాన గీతం, తక్కువ నిడివితో కూడిన గీతాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా కీరవాణి, అందెశ్రీలను సీఎం రేవంత్‌రెడ్డి సన్మానించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X