जुबली हिल्स उपचुनाव में भारी संख्या में नामांकन दाखिल, अगर ऐसा हुआ तो बैलेट फाइट तय

हैदराबाद: जुबली हिल्स उपचुनाव में रिकॉर्ड संख्या में नामांकन दाखिल किए गए। मंगलवार को आखिरी दिन 160 से ज़्यादा उम्मीदवारों ने नामांकन दाखिल किए। चुनाव अधिकारियों ने बताया कि इस महीने की 13 तारीख से नामांकन पत्र दाखिल करने की शुरुआत के बाद से 94 उम्मीदवारों ने नामांकन दाखिल किए हैं। रविवार और दिवाली की दो दिन की छुट्टियों के कारण नामांकन स्वीकार नहीं किए गए। उम्मीदवारों ने मंगलवार को आखिरी दिन बड़ी संख्या में नामांकन दाखिल किए। जुबली हिल्स उपचुनाव को विभिन्न मुद्दों पर सरकार के विरोध के मंच के रूप में इस्तेमाल किया जा रहा है।

हालाँकि, नामांकन दाखिल करने का समय सुबह 11 बजे से दोपहर 3 बजे तक ही था और बड़ी संख्या में उम्मीदवार आए थे। इसलिए अधिकारियों ने टोकन प्रणाली शुरू की। पहले नामांकन दाखिल करने वालों को टोकन दिए गए और फिर नामांकन पत्र स्वीकार किए गए। 188 लोगों को टोकन दिए गए। रात तीन बजे तक 211 उम्मीदवारों ने 321 सेट नामांकन दाखिल किये हैं।

नामांकन दाखिल करने वालों में अधिकतर क्षेत्रीय रिंग रोड (आरआरआर), फार्मेसी के भूमिहीन और बेरोजगार शामिल हैं। फार्मेसी के कारण अपनी ज़मीन गँवा रहे किसानों ने चुनाव कार्यालय पर तख्तियाँ लेकर विरोध प्रदर्शन किया। 11 किसानों ने नामांकन दाखिल किया। ट्रिपल आर में अपनी ज़मीन गँवाने वाले किसान भी नामांकन दाखिल करने के लिए बड़ी संख्या में आए।

इसी क्रम में अनुसूचित जाति वर्गीकरण का विरोध करते हुए संघों के जेएसी से 30 लोगों ने नामांकन दाखिल किया। सेवानिवृत्त सरकारी कर्मचारी कल्याण समिति के 11 लोगों ने नामांकन दाखिल किया। बड़ी संख्या में नामांकन दाखिल होने से प्रमुख दलों में चिंता की लहर है। इस बात को लेकर चिंता है कि अगर ज़्यादा लोग मैदान में होंगे तो उन्हें कौन से चुनाव चिन्ह आवंटित किए जाएँगे और इसका क्या असर होगा। नामांकन पत्रों की जाँच बुधवार को होगी। 24 तारीख तक नामांकन वापस लिए जा सकते हैं।

जीएचएमसी चुनाव विभाग के अधिकारियों ने बताया कि अगर उम्मीदवारों की संख्या 63 से ज़्यादा होती है, तो चुनाव बैलेट से कराने होंगे। एक कंट्रोल यूनिट 4 बैलेट यूनिट को सपोर्ट करती है। हर बैलेट यूनिट में 16 उम्मीदवारों के 64 नाम होते हैं। अगर नोटा को हटा दिया जाए, तो सिर्फ़ 63 उम्मीदवारों के पास ही मौका है। इसलिए अगर इससे ज़्यादा उम्मीदवार मैदान में रहते हैं, तो बैलेट फाइट होना तय है।

यह भी पढ़ें-

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో భారీగా నామినేషన్లు

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజైన మంగళవారం ఒక్కరోజే 160 మందికిపైగా నామినేషన్లు వేశారు. ఈ నెల 13న నామినేషన్ల స్వీకరణ మొదలవగా 18 వరకు 94 మంది అభ్యర్థులు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆదివారం, దీపావళి పండుగతో రెండు రోజులు సెలవు దినాలు కావడంతో నామినేషన్ల స్వీకరణ జరగలేదు. చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు పోటెత్తారు. పలు అంశాల విషయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపే వేదికగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను వినియోగించుకుంటున్నారు.

అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలుకు అవకాశముండటం, అభ్యర్థులు పెద్దసంఖ్యలో రావడంతో అధికారులు టోకెన్‌ విధానం ఏర్పాటు చేశారు. నామినేషన్‌ వేసేవారికి ముందు టోకెన్‌ ఇచ్చి అనంతరం నామపత్రాలు స్వీకరించారు. 188 మందికి టోకెన్లు ఇచ్చారు. రాత్రి 12 గంటల వరకు 160 నామినేషన్లు దాఖలు కాగా, ఆ తరువాత కూడా ప్రక్రియ కొనసాగింది. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 250కి పైగా నమోదయ్యే అవకాశం ఉంది.

నామినేషన్లు దాఖలు చేసిన వారిలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌), ఫార్మాసిటీ భూనిర్వాసితులు, నిరుద్యోగులు ఉన్నారు. ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు ఎన్నికల కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. 11 మంది రైతులు నామినేషన్‌లు వేశారు. ట్రిపుల్‌ ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులు కూడా మూకుమ్మడిగా నామినేషన్లు వేసేందుకు వచ్చారు.

కాగా, ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నుంచి 30 మంది నామినేషన్‌లు వేశారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమితి నుంచి 11 మంది నామినేషన్‌లు దాఖలు చేశారు. భారీగా నామినేషన్లు దాఖలు కావడం ప్రధాన పార్టీలకు వణుకు పుట్టిస్తోంది. ఎక్కువ మంది బరిలో ఉంటే వారికి ఏ గుర్తులు కేటాయిస్తారు, ఆ ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నామినేషన్ల పరిశీలన బుధవారం జరగనుంది. 24 వరకు నామినేషన్ల ఉపంసహరణకు అవకాశముంది.

అభ్యర్థుల సంఖ్య 63 దాటితే బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు పేర్కొన్నాయి. ఒక కంట్రోల్‌ యూనిట్‌ 4 బ్యాలెట్‌ యూనిట్లను సపోర్ట్‌ చేస్తుంది. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో 16 చొప్పున 64 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి. నోటా మినహాయిస్తే.. 63 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశమున్న దృష్ట్యా.. అంతకంటే ఎక్కువ మంది పోటిలో ఉంటే బ్యాలెట్‌ పోరు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X