इंदिराम्मा आवास के लिए पांच लाख रुपये वित्तीय सहायता, ये हैं नियम, ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల ఆర్థిక సాయం

हैदराबाद: ज्ञात हो कि रेवंत रेड्डी सरकार गरीबों के लिए घर निर्माण के लिए 5 लाख रुपये की वित्तीय सहायता प्रदान कर रही है। इंदिराम्मा आवास योजना के तहत बेघर लोगों को आवास उपलब्ध कराने के लिए सहायता प्रदान की जा रही है। इस योजना को औपचारिक रूप से 26 जनवरी को शुरू किया गया और तेलंगाना में प्रत्येक मंडल से एक गांव का चयन करके लाभार्थियों की सूची तैयार की गई थी। इसके लिए अधिकारी संबंधित गांवों में लाभार्थियों के घरों की ग्राउंडिंग की व्यवस्था कर रहे हैं। गांवों में लाभार्थियों के साथ प्री-ग्राउंडिंग बैठकें आयोजित करने की तैयारियां चल रही हैं। लाभार्थियों को सरकारी नियमों के अनुसार मकान बनाने की विधि, निर्माण सामग्री तथा अन्य जानकारी दी जाएगी।

इंदिराम्मा आवास के लिए ये हैं नियम हैं

इंदिराम्मा ऐप सर्वेक्षण के दौरान लाभार्थी को अपने स्वयं के रूप में दर्शाए गए क्षेत्र में स्वयं रंगोली डालनी होगी। यदि पहले उल्लेखित स्थान के अलावा कहीं और आवास बनाने का विकल्प देता है तो अधिकारी उस मकान को रद्द कर देंगे।

आवास स्थान पर रंगोली डालने के बाद ग्राम सचिव को सूचित करना होगा। सचिव मैदान में आएंगे, तस्वीरें लेंगे और उन्हें ऑनलाइन अपलोड करेंगे। इसके बाद निर्माण स्थल की जियो-टैगिंग की जाएगी।

रंगोली डालने के समय सरकार की ओर से कोई वित्तीय सहायता नहीं मिलेगी। आधारशिला पूरी होने के बाद ही लाभार्थी के बैंक खाते में एक लाख रुपये की पहली किस्त जमा की जाएगी।

मकान कम से कम 400 वर्ग फीट के भूखंड पर बनाया जाना होगा।

सरकार ने हर मकान को 8 ट्रैक्टर रेत उपलब्ध कराने का निर्णय लिया है। प्रासंगिक कूपन एमआरओ या आरडीओ द्वारा प्रदान किए जाएंगे।

आवास निगम द्वारा सीमेंट और स्टील जैसी निर्माण सामग्री कम कीमत पर उपलब्ध कराई जाएगी।

सहायक अभियंता या एमपीडीओ क्षेत्र स्तर पर जाकर आवास निर्माण के पूरा होने के चरण के आधार पर लाभार्थियों के खातों में धनराशि जमा करने की सिफारिश करते हैं।

हालांकि, सरकार ने पहले चरण में 71,482 मकानों की मंजूरी दी हैं। 21 निर्वाचन क्षेत्रों में एक हजार से अधिक मकान उपलब्ध कराये जायेंगे। कहा गया कि प्रत्येक विधानसभा क्षेत्र के लिए प्रति वर्ष 3500 की दर से कुल 4 लाख मकान मंजूर किए जाएंगे। शेष मकान भी शीघ्र स्वीकृत किए जाएंगे। कुल 5 लाख रुपये की वित्तीय सहायता चार किस्तों में लाभार्थियों के खातों में जमा की जाएगी।

Also Read-

పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, నిబంధనలు ఇవే

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఆవాసం కల్పించేందుకు సాయం అందిస్తన్నారు. జనవరి 26 పథకం లాంఛనంగా ప్రారంభం కాగా తెలంగాణ వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారుల జాబితాను రెడీ చేశారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్ల గ్రౌండింగ్‌ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో లబ్ధిదారులతో ప్రీ-గ్రౌండింగ్‌ సమావేశాల ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఇంటిని ఎలా నిర్మించుకోవాలి, నిర్మాణ సామగ్రి, ఇతర అనుమానాలను లబ్ధిదారులకు వివరించనున్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు నిబంధనలు ఇవే..

ఇందిరమ్మ యాప్‌ సర్వే సమయంలో సొంత జాగా చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే స్వయంగా ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. ముందు చెప్పిన జాగాలో కాకుండా మరోచోట ఇల్లు కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు.

ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కార్యదర్శి క్షేత్రస్థాయికి వచ్చి ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. అనంతరం నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్‌ చేస్తారు.

ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉండదు. పునాది పూర్తయిన తర్వాతే తొలి విడతలో రూ.లక్షను లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

కనీసం 400 చదరపు అడుగుల స్థలంలో ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది.

ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన కూపన్లను ఎమ్మార్వో లేదా ఆర్డీవో ద్వారా అందించనున్నారు.

సిమెంటు, స్టీలు వంటి నిర్మాణ సామగ్రిని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా తక్కువ ధరకు అందిస్తారు.

క్షేత్రస్థాయిలో ఏఈ లేదా ఎంపీడీవోలు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారుడి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిఫార్సు చేస్తారు.

కాగా, ప్రభుత్వం తొలి విడతలో 71,482 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 21 నియోజకవర్గాల్లో వెయ్యికిపైగా ఇండ్లు ఇవ్వనుంది. ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 3500 చొప్పున మెుత్తం 4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పగా మిగతా ఇండ్లను త్వరలోనే మంజూరు చేయనున్నారు. మెుత్తం రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X