हैदराबाद: बत्तीनी बंधुओं ने मछली प्रसाद वितरण की तारीख फाइनल कर ली है। बत्तीनी अमरनाथ गौड़ ने बताया कि नौ जून को सुबह आठ बजे से लगातार 24 घंटे मछली प्रसाद का वितरण किया जायेगा। उन्होंने कहा कि नामपल्ली प्रदर्शनी मैदान में मछली का प्रसाद वितरण किया जाएगा। इसी सिलसिले में मंगलवार 23 मई को बत्तीनी बंधुओं ने सचिवालय में मंत्री तलसानी श्रीनिवास यादव से मुलाकात की और तारीख को अंतिम रूप दिया।
मंत्री तलसानी श्रीनिवास यादव ने कहा कि मछली प्रसाद वितरण के लिए सभी प्रबंध किए जाएंगे। उन्होंने कहा कि तेलंगाना राज्य बनने के बाद मुख्यमंत्री केसीआर के आदेशानुसार सरकार के निर्देशन में सभी व्यवस्थाएं की जा रही हैं। तलसानी ने कहा कि दूसरे राज्यों और विदेशों से लाखों लोग मछली प्रसाद के लिए आते हैं। किसी भी समस्याओं से बचने के लिए सभी सावधानियां बरती जाएंगी।
मंत्री ने स्पष्ट किया कि राज्य मत्स्य विभाग की ओर से आवश्यक छोटी मछली उपलब्ध कराया जायेगा। मंत्री तलसानी ने कहा कि नामपल्ली प्रदर्शनी मैदान में इस महीने की 25 तारीख को सभी विभागों के अधिकारियों के साथ विशेष बैठक की जाएगी।
मंत्री ने सुझाव दिया कि प्रसाद के लिए आने वालों को सलाह दी जाती है कि चार घंटे पहले से भोजन न करें। साथ ही प्रसाद ग्रहण करने के बाद दो घंटे तक कुछ भी ग्रहण नहीं करना चाहिए। हर साल मृगसिरा कार्तिक के मौके पर बत्तीनी बंधु अस्थमा पीड़ितों को मुफ्त में मछली का प्रसाद बांटते हैं। लेकिन कोरोना के कारण तीन साल से मछली प्रसादम का वितरण बंद है। सरकार ने इस साल से मछली प्रसादम बांटने की अनुमति दे दी है। बत्तीनी बंधु हमेशा की तरह नामपल्ली प्रदर्शनी मैदान में मुफ्त में मछली का प्रसाद का वितरण करेंगे।
अस्थमा के मरीज मछली प्रसाद के लिए हैदराबाद आते हैं। बत्तीनी बंधुओं की ओर से दी जाने वाली मछली के प्रसाद के लिए लोग कई किलोमीटर तक लाइन में होते हैं। चूंकि कोरोना के बाद पहली बार मछली का प्रसाद बांटा जा रहा है। ऐसे में उम्मीद की जा रही है कि इस बार लोगों का हुजूम उमड़ेगा।
జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ, మంత్రి తలసానితో బత్తిన సోదరుల భేటీ
హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీ తేది ఖరారు చేశారు బత్తిన సోదరులు. జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 24 గంటల పాటు నిరంతరంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు బత్తిన అమర్నాథ్ గౌడ్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మే 23వ తేదీ మంగళవారం సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో బత్తిన సోదరులు భేటీ అయ్యారు.
చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తామని తలసాని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారాయన. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి లక్షలాది మంది వస్తారన తలసాని ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇందుకు అవసరమైన చేప పిల్లలను రాష్ట్ర మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ నెల 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ప్రసాదం కోసం వచ్చేవారు నాలుగు గంటల ముందు నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకూడదని సూచించారు. ప్రసాదం తీసుకున్న అనంతరం రెండు గంటల పాటు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దని తెలిపారు. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు బత్తిన సోదరలు. అయితే కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ మూడేళ్లుగా నిలిచిపోయింది. ఈ ఏడాది నుంచి చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉబ్బసం వ్యాధి గ్రస్తులు హైదరాబాద్ కు వస్తుంటారు. బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం జనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు. కరోనా తర్వాత తొలిసారి చేప ప్రసాదం పంపిణీ కావడంతో ఈ సారి జనం భారీగా తరలి రానున్నారని అంచనా వేస్తున్నారు. (ఏజెన్సీలు)