NCCPA COC తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం, రెండో విడత పోరాటాలను ఉదృతంగా చేయాలని పిలుపు

హైదరాబాద్ : NCCPA COC తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం చిక్కడపల్లి B-1 క్వార్టర్స్‌లో డాక్టర్ శ్రీధర్ అధ్యక్షతన జరిగింది. వేదికపై సీనియర్ నాయకులు ఎం. ఎన్. రెడ్డి, గోపాల్ రెడ్డి, ఎన్. సోమయ్య, జలాలుద్దీన్ ఆసీనులైనారు.

ఈ సందర్భంగ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ మొదటి విడుదగా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన పోరాటాలు తెలంగాణలో విజయవంతమైనట్టు చెప్పారు. మేధావులు కూడా సపోర్టు చేసినారు. రెండో విడత పోరాటాలను ఉదృతంగా చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్. సోమయ్య మాట్లాడుతూ ఈ ప్రభుత్వము పెన్షనర్లను అన్ కంట్రీబుటేడ్, అం అండ్ ఫండెడ్ పెన్షనర్స్ గా తప్పుడు ప్రచారం చేస్తా ఉంది. దానికి వ్యతిరేకంగా పెన్షనర్ అందర్నీ ఐక్యత చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో జరిగిన నిరసన పోరాటాలను తెలియపరుస్తూ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు కన్వెన్షన్లు నిర్వహించాలని చెప్పారు. ఈ నెల 24 న అన్ని పెన్షనర్ల సంఘాలను కలుపుకొని వేలాది మందితో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చెయ్యాలి అని చెప్పారు.

ముందుగా ఏరియా వైజ్ గా జర్నల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ మొండి వైఖరి, నిర్లక్ష్య ధోరణిని పెన్షనర్స్ కు తెలియపరచాలని చెప్పారు. హైదరాబాద్ రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లా స్థాయిలలో సదస్సులు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వానికి తెలియ వచ్చే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని చెప్పారు.

Also Read-

శివలింగం CGHS కంచన్బాగ్ నుండి మాట్లాడుతూ బ్యాంక్ పెన్షనర టాప్రా పబ్లిక్ సెక్టర్స్ఈపీఎఫ్, రైల్వే,కన్ఫర్ట్రేషన్, సర్వీస్ లో ఉన్న ఎంప్లాయిస్ యూనియన్స్ మొదలగు అన్ని పెన్షనర్ల సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడే ఈ ప్రభుత్వానికి, ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. లేనిపక్షంలో ప్రభుత్వమే పెన్షనలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తుంది.

ఎమ్. ఎన్. రెడ్డి మాట్లాడుతూ రైల్వే నాయకత్వం ఎక్కువ సంఖ్యలో మొబలైస్ చేయాలని చెప్పారు. ప్రభుత్వము పెన్షనర్స్, వర్కర్స్ వ్యతిరేకమైనది. పెద్ద సంఖ్యలో పెన్షనర్లను కలుపుకొని ధర్నా చేసినప్పుడే ప్రభుత్వం దిగొస్తుందని చెప్పారు. గోపాల్ రెడ్డి, జోనల్ అడ్వైజర్ కమిటీ మెంబర్, మహేష్ రైల్వే లీడర్ కృష్ణమోహన్ ఎం. అర్జున్ M. నరహరి మొదలగు నాయకులు మాట్లాడినారు. సుధామ ఓట్ ఆఫ్ థాంక్స్ తో సమావేశం ముగిసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X