మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల ఇంటర్ ర్యాంకర్లను ఘనంగా సన్మానించిన మంత్రి గంగుల కమలాకర్

ఎంపీసీలో రాష్ట్ర 4,5,6, బైపీసీలో 6,7, ఎంఈసిలో 4,5 300 పైగా విద్యార్థులకు 10 లోపు ర్యాంకులు

ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ అభినందించిన మంత్రి

మంత్రి పలకరింపుతో పులకరించి పోయిన విద్యార్థులు

టాప్ ర్యాంకర్లకు నగదు ప్రోత్సాహకాలు అందజేత

సచివాలయంలో ఘనంగా ఎంజేపి గురుకుల విద్యార్థుల అభినందన కార్యక్రమం

హైదరాబాద్ : మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులాలు తమ సత్తాను చాటాయి, 87% ఉత్తీర్ణత సాధించడమే కాక రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో ఎంపీసీలో రాష్ట్ర 4,5,6, బైపీసీలో 6,7, ఎంఈసిలో 4,5 ర్యాంకులను పదుల సంఖ్యలో విద్యార్థులు సాధించారు. మొత్తంగా 300 పైచీలుకు విద్యార్థులు 10 లోపు ర్యాంకులను సాధించారు.

ఈ సందర్భంగా నేడు రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురుకుల విద్యార్థులను ఘనంగా సన్మానించారు. మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థిని కుటుంబంతో కలిసి పుష్పగుచ్చాన్ని అందజేస్తూ శాలువాలు కప్పి మెమెంటోలు అందజేశారు.

వారికి ప్రోత్సాహంగా నగదు పురస్కారాలను సైతం అందజేశారు. ప్రతి విద్యార్థితో వారి తల్లిదండ్రులతో మాట్లాడి అభినందిస్తూ వారి చదువుకున్న తీరుతెన్నులను తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అద్భుతంగా రాణిస్తూ మరెన్నో శిఖరాలను అధిరోహించి తెలంగాణ పేరు ప్రతిష్టలను నిలపాలని వారికి సూచించారు. ఒక్కో విద్యార్థిపై లక్ష న్నర ఖర్చు చేస్తూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో 310 బీసీ గురుకులాలు నిర్వహిస్తున్నామన్నారు.

స్వయంగా మంత్రి వారి వెన్ను తట్టి ప్రోత్సహించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పులకరించిపోయారు. మంత్రి అభినందన పూర్వక మాటలకు స్పూర్తి పొందారు. ఈ విజయానికి కెసిఆర్ ప్రభుత్వం అందించిన తోడ్పాటి కారణమని చెప్పారు. చివరగా మంత్రితో అందరూ గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం మంత్రిగారితో సెల్ఫీలు దిగి ఆనందించారు. నూతన సచివాలయం అద్భుతంగా ఉందని పిల్లలంతా సెల్ఫీలు ఫోటోలు తీసుకొని మురిచిపోయారు.

ఈ ఏడాది 18079 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షకు నమోదు చేసుకోగా 17204 మంది విద్యార్థులు ఉత్తర్ణతా సాధించారు. 207 మంది విద్యార్థులు పది జిపిఏ సాధించి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తమ ప్రతిభను ప్రదర్శించారు. మూడు జిల్లాలు నూటికి నూరు శాతం ఉత్తర్ణతా సాధించగా, 30 జిల్లాలోని గురుకుల పాఠశాలను 90శాతంగానికి పైగా ఉత్తర్ణతా సాధించాయి. మూడు జిల్లాలు 83శాతానికి పైగా ఉత్తర్ణతా సాధించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎం జె పి గురుకులాల సెక్రటరీ మల్లయ్య బట్టు, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X