हैदराबाद: तेलंगाना के जगतियाल जिले में भीषण सड़क हादसे में महिला एसआई की मौत हो गई। जिले के डीसीआरबी में एसएस के रूप में कार्यरत कोक्कुला श्वेता, गोलापल्ली दिशा से आ रही थीं। उसी समय चिल्वाकोडुर के पास सामने से आ रही एक बाइक को बचाने के प्रयास में उसकी कार एक पेड़ से टकरा गई।
प्रत्यक्षदर्शियों ने बताया कि दुर्घटना में गंभीर रूप से घायल एसआई श्वेता के साथ बाइक पर सवार व्यक्ति की घटनास्थल पर ही मौत हो गई। शवों को पोस्टमार्टम के लिए जगतियाल के सरकारी अस्पताल भेज दिया गया। इस दुर्घटना के पूर्ण कारणों का अभी तक पता नहीं चल पाया है।

ఘోర రోడ్డు ప్రమాదం, మహిళా ఎస్ఐ మృతి
హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందారు. జగిత్యాల జిల్లా డి సి ఆర్ బి లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కొక్కుల శ్వేత గొల్లపల్లి వైపు నుండి జగిత్యాల వస్తుండగా చిల్వకోడూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి చెట్టును బలంగా ఢీ కొట్టింది.
Also Read-
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఎస్సై శ్వేత తో పాటు బైక్ పైన ఉన్న మరో వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీలను జగిత్యాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)