శాంతిభద్రతలు పటిష్టంగా ఉంచడం వల్ల పెట్టుబడులు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది: ఎర్రబెల్లి దయాకర్ రావు

సీఎం కేసీఆర్ వచ్చాక శాంతి, భద్రతలు పెరిగాయి, పోలీసుల గౌరవం పెరిగింది

రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలన్నీ తీరుస్తున్నారు

పోలీస్ పరిపాలనలో ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోరు.. ప్రజల పక్షం.. న్యాయ పక్షం వహించాలి

వరంగల్ జిల్లా ఎనుమాముల పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని, పోలీసులకు గౌరవం పెరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా శాంతిభద్రతలు పటిష్టంగా నిర్వహించాలని, పోలీసుల పరిపాలనలో ప్రజాప్రతినిధులు ఎలాంటి జోక్యం చేసుకోమని, ప్రజల పక్షం, న్యాయం పక్షం వహించి ప్రజల మెప్పు పొందాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు.

ఆసియాలోని అతిపెద్ద వరంగల్ ఎనుమాముల మార్కెట్ దగ్గర ఎనుమాముల పోలీస్ స్టేషన్ను మంత్రి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాటలు..

“ఎమ్మెల్యే రమేష్ గారు మాతో పట్టుపట్టి ఈ పోలీస్ స్టేషన్ సాధించుకున్నారు. ఇక్కడి పోలీస్ సిబ్బంది, ప్రజలకు శుభాకాంక్షలు. పోయిన సీపీ బాగా పని చేశారు..ఈ సీపీ అంతకు మించి చేయాలి. భూదందాలు, క్రైమ్ బాగా హ్యాండిల్ చేయాలి. కొత్తగా వచ్చిన సీపీ గతంలో బాగా చేశారని సీఎం కేసిఆర్ గారు ఇక్కడ వేశారు. కొత్త పోలీస్ స్టేషన్ సీఐ చేరాలు బాగా పని చేయాలి. గతంలో తెలంగాణ రాక ముందు ఎలా ఉండే… సీఎం కేసిఆర్ గారు వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది ప్రజలు ఆలోచించాలి. వరంగల్ జిల్లా జీప్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా నేను పని చేశాను. అప్పట్లో పోలీస్ స్టేషన్ కు జీప్ లేకపోతే మేమే జీప్ పెట్టేది. అలా వారానికి ఒక జీప్ మేమే పెట్టేది. డీజిల్ పోసేది కూడా మేమే. దాంతో జీప్ అసోసియేషన్ ఏమి చేసినా.. జీప్స్ కు లైసెన్సు లేకపోయినా.. ఏమన్నా చేసినా అన్ని మాఫీ చేసేవారు.

అప్పట్లో పోలీస్ స్టేషన్ కి వసతులు కూడా ఉండేవి కావు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు కార్ ఇచ్చి, దానికి ఖర్చులు ఇచ్చి, ఒక్కో పోలీస్ స్టేషన్ కి 20 నుంచి 50 వేలు నిర్వహణ ఖర్చు ఇచ్చి గౌరవం పోలీస్ స్టేషన్ పెంచారు సీఎం కేసిఆర్ గారు. హోమ్ గార్డు జీతం కూడా 12 వేల నుంచి 20 వేలకు పెంచారు. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో కేసులు తొందరగా విచారించి, వెంట వెంటనే పరిష్కారం చేస్తున్నారు.

ఈ మార్కెట్ చాలా ముఖ్యం. రైతులకు సంబంధించిన మార్కెట్ ఇది. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటే వారికి బాగా ఉపయోగం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దోనపూడి రమేష్ గారు, నారాయణ రావు గారు ఉన్నపుడు ఇక్కడ పెద్ద మార్కెట్ కట్టారు. దీనికి గొప్ప చరిత్ర ఉంది. దానిని కాపాడాలి. సీఎం కేసీఆర్ గారు రైతులకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్నారు. ఈరోజే రైతుబంధు కోసం 6వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు.

రైతులకు 365 రోజులు కాలువ నీళ్ళు, కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసిఆర్. వ్యాపారస్తులు కూడా రైతులు బాగుండేటట్లు చూడాలి. ప్రభుత్వం వారికి అన్ని చేస్తుంది. మీ సహకారం కూడా ఉండాలి. పోలీసుల అడ్మినిస్ట్రేషన్ లో మేము జోక్యం చేసుకోము. న్యాయం పక్షం వహించండి. జెన్యూన్ గా పని చేయండి. ప్రజల మెప్పు పొందండి. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి.”

ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి మాటలు…

“వర్ధన్నపేట నియోజక వర్గ పరిధిలో ఆసియాలో అతిపెద్ద మార్కెట్ ఎనుమాముల. ఈ మార్కెట్ లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం సంతోషం. దీనికి సహకరించిన మంత్రి దయన్నకు కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టి, అనేక కంపెనీలు, పెట్టుబడి దారులు వస్తున్నారు. సీఎం కేసీఆర్ గారు దూరదృష్టితో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.”

పోలీస్ కమిషనర్ రంగనాథ్ గారి మాటలు…

“నేను వచ్చి రెండు వారాలు దాటింది. నేను వచ్చాక మొదటి పోలీస్ స్టేషన్ ప్రారంభించుకున్నాం. దీని ప్రకారం ఇది కీలక పోలీస్ స్టేషన్. పేద ప్రజలు, రైతులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రజలున్న ప్రాంతం కాబట్టి పోలీసుల పనితీరు కూడా అలా ఉండాలి. యాద్భావం తద్భావతి అనే సూక్తి ప్రకారం మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. కాబట్టి సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించాలి. నూతన సి.ఐ కి శుభాకాంక్షలు. సిఐ కి పెద్ద బాధ్యత ఉంది. శాంతి, భద్రతలు బాగుంటే పెట్టుబడులు వస్తాయి…ఉపాధి ,ఉద్యోగాలు వస్తాయి. స్థానికులు బాగు పడుతారు.”

కలెక్టర్ గోపి గారి మాటలు…

పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మౌలిక సదుపాయాలు పెంచుకుంటున్నాం. ఈ నూతన పోలీస్ స్టేషన్ వల్ల ప్రజలకు మరింత ఉపయోగం ఉంటుంది. ఈ కార్యక్రమంలో డీసీపీ వెంకట లక్ష్మీ, ఏసిపి నరేష్, కార్పొరేటర్లు సులోచన సారయ్య, షిబా రాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X