బోడుప్పల్ ప్రైవేట్ పాఠశాలలో ఒకటవ తరగతి విద్యార్థినిపై డాన్స్ టీచర్ లైంగిక దాడిని ఖండించిన డాక్టర్ శిల్పారెడ్డి

హైదరాబాద్ : నిన్న బోడుప్పల్లో ఒక ప్రైవేటు అంతర్జాతీయ పాఠశాలలో డాన్స్ టీచర్ గా పని చేస్తున్న వ్యక్తి ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని లైంగిక దాడిని చేసింది ఈరోజు బిజెపి రాష్ట్రానికి మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి గారు పాఠశాలలో పర్యటించి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల రక్షణకై ఉండాల్సిన సిసి కెమెరాలు సెక్యూరిటీ గాని ఉండకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఆడపిల్లల విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు కూడా పాఠశాల యాజమాన్యం తీసుకోకపోవడంతో నే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయన ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి పాఠశాలలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని పోలీస్ స్టేషన్ల ద్వారా సమీక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదివరకే గత ప్రభుత్వంలో బంజారాహిల్స్ లో ఇలాంటి సంఘటన జరిగిందని.. ఇకపై జరగకుండా ఈ ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి బాధ్యున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇకపై ప్రైవేట్ పాఠశాలల్లో తల్లిదండ్రులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆ కమిటీ ద్వారా పిల్లలకు సంబంధించిన సమస్యలను వెంటనే స్కూలు యాజమాన్యాలకు చేరవేసేలా ఉండాలని.. పాఠశాలలో పిల్లలతో నేరుగా పనిచేసే స్పోర్ట్స్ మరియు డాన్స్ వంటి టీచర్లను ఎంపిక చేసే ముందు వారి వ్యక్తిగత వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని. పిల్లలు డాన్స్ మరియు ఆటలు ఆడే ప్రదేశాలలో పాఠశాల యాజమాన్యం అబ్జర్వర్లను ప్రత్యేకంగా నియమించాలని అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉంటాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X