ఉద్యోగుల నిరసనతో భగ-భగ మండుతున్న డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు గురువారం మధ్యాహ్నం 1.00 నుండి 1.30 వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు.

అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ముందు ఉన్నా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు మరియు వివిధ సంఘాల నాయకులు ప్రసంగించారు.

Also Read-

ఈ నిరసన కార్యక్రమంలో జేఎసీ ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; కన్వీనర్ ప్రొ వడ్డాణం శ్రీనివాస్; సెక్రటరీ జనరల్ మహేష్ గౌడ్ జేఎసీ నేతలు డా. యాకేష్ దైద; కాంతం ప్రేంకుమార్; డా. రవీంద్రనాథ్ సోలమన్; డా. ఎల్.వి.కె. రెడ్డి; ఎండి హబీబుద్దిన్; రజనికాంత్; షబ్బీర్; రాములు, డా. ఎ. నారాయణరావు; రుషేంద్ర మణి ; డా. అవినాష్; డా. కిషోర్; డా. రాఘవేందేర్, డా. జి. అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X