Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU) in collaboration with Infinx Healthcare Pvt.Ltd organized Job Mela for Science students who passed in 2024 and 2025 batches at its campus on Friday. Prof. Ghanta Chakrapani, Vice Chancellor stated that we are working towards providing job opportunities to every student studying at Dr. B. R. Ambedkar Open University. He revealed that a mega job fair will be organized in collaboration with more companies in the coming days and steps will be taken to organize one job fair every month.

Dr. P. Venu Gopal Reddy, Placement Officer explained that this job fair was organized specifically for students who passed out in the 2024 and 2025 batches. Spot offer letters were issued by Infinx Healthcare Pvt.Ltd officials to the selected candidates in the Job Mela. Prof. G. Pushpa Chakrapani, Director Academic; Prof. Rabindranath Solomon, Director EMR&RC were present. Infinx Healthcare Pvt.Ltd officials Manohar Ramagalla, Sai Krishna, Navdeep sai acted as interview board members for the job mela.
Also Read-
విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం : వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాబ్ మేళ
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో చదివే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఇన్ఫింక్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో శుక్రవారం విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో జాబ్ మేళను నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీల సహకారంతో మెగా జాబ్ మేళ నిర్వహించనున్నట్లు, ప్రతీ నెల ఒక జాబ్ మేళ నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

ఈ జాబ్ మేళా ప్రత్యేకంగా 2024, 2025 బ్యాచ్‌లలో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం నిర్వహించామని విశ్వవిద్యాలయ ప్లేస్మెంట్ ఆఫీసర్ డా. వేణు గోపాల్ రెడ్డి వివరించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆ సంస్థ అధికారులు వెంటనే ఉద్యోగ నియామక పత్రాలను జారీ చేశారు. కార్యక్రమం లో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, EMR&RC డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ పాల్గొన్నారు. ఇన్ఫింక్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు మనోహర్ రామగల్ల, సాయి కృష్ణ, నవదీప్ సాయి ఉద్యోగ మేళాకు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులుగా వ్యవహరించారు.
