విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యోగుల ప్రతిజ్ఞ
హైదరాబాద్ : సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో శనివారం “రాష్ట్రీయ ఏక్తా దివస్” (జాతీయ ఐక్యతా దినోత్సవం) నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఆదేశాల మేరకు, దేశ ఐక్యత, సమగ్రత, దేశ భద్రతను కాపాడటంతో పాటు వాటిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉద్యోగులందరూ సమష్టిగా “రాష్ట్రీయ ఏక్తా దివస్” ప్రతిజ్ఞ చేశారు. అనంతరం యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

అదేవిధంగా, కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు అక్టోబర్ 26 నుండి నవంబర్ 1, 2026 వారకు నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా విశ్వవిద్యాలయంలో “సమగ్రతతో సమృద్ధి” అనే అంశంపై విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ్ కృష్ణారెడ్డి “అవినీతిపై పోరాటం – నిజాయితీ ప్రతిజ్ఞ” (Fight Against Corruption – Integrity Pledge) ను ఉద్యోగులతో అవినీతికి వ్యతిరేకంగా, కార్యాలయంలో తమ విధులను పారదర్శకతతో నిబద్ధతతో నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, నిజాయితీ, నైతిక విలువలను పాటిస్తామని ఉద్యోగులంతా పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమాల్లో విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, ప్రొ. కె. రాణి రజిత మాధురి; ప్రొ. ప్రమీలా కేతావత ప్రొ.మేరీ సునంద; ప్రొ. వెంకట రమణ, డా. వై. వెంకటేశ్వర్లు అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, బోధన మరియు బోధనేతర సంఘాల ప్రతినిధులు కె. ప్రేమ్ కుమార్, మియా జానీ, మంజుల, భరత్ రెడ్డి, డా. యాకేష్ దైదా పాల్గొన్నారు.
Also Read-


One thought on “డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విజిలెన్సు ప్రతిజ్ఞ, జాతీయ ఐక్యతా దినోత్సవ ర్యాలీ”