కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పరిధిలోని నాగంపేట గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఇల్లందుల శ్రీనివాసు అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఐదేళ్లుగా నాగంపేట్ లో విధులు నిర్వహించిన ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఇల్లంతకుంట జూలై 2024లో సిరిసేడు గ్రామానికి బదిలీ చేశారు.
విధుల నిర్వహణలో భాగంగా భారీగా అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు ప్రజలు ఆరోపించారు. ఈ మేరకు డీపీవోకు ఫిర్యాదులు వెళ్లాయి. ముఖ్యంగా దళిత బంధు, వార సంత/గొర్రెల మేకల అంగడి, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రజలు పేర్కొన్నారు.
Also Read-
అయితే బదిలీయైన శ్రీనివాసు పేరుతో ఆయన స్థానంలో చేరిన గ్రామ కార్యదర్శి అంకుష్ ఆర్ టీఐ పై సంతకం చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అవినీతికి పాల్పడి పోర్టరీ సంతకాలు చేసిన గ్రామ కార్యదర్శిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.