हैदराबाद: क्रिकेटर करुण नायर ने शुक्रवार को विजयनगरम (आंध्र प्रदेश) में विदर्भ को विजय हजारे ट्रॉफी के ग्रुप डी मैच में उत्तर प्रदेश पर आठ विकेट की जीत दिलाने में अहम भूमिका निभाई। करुण नायर बिना आउट हुए सर्वाधिक रन बनाने का विश्व रिकॉर्ड बनाया। इसके साथ ही उन्होंने न्यूजीलैंड के पूर्व ऑलराउंडर जेम्स फ्रैंकलिन के 2010 में बनाए गए 527 रन के रिकॉर्ड को पीछे छोड़ दिया। दाएं हाथ के बल्लेबाज इस बल्लेबाज ने आखिरकार 112 रन पर आउट हो गए। इससे उनकी कुल संख्या 542 रन पर रुक गई। इसके साथ करुण ने एक नया रिकॉर्ड बनाया। इस सूची में अन्य खिलाड़ी जोशुआ वैन हीर्डन (512), फखर जमां (455) और तौफीक उमर (422) शामिल हैं।
विजय हजारे ट्रॉफी में करुण का चौथा और लगातार तीसरा शतक था। इससे विदर्भ ने उत्तर प्रदेश के आठ विकेट पर 307 रन के स्कोर को 47.2 ओवर में हासिल कर लिया। यश राठौड़ ने 140 गेंद में नाबाद 138 रन बनाए जिससे विदर्भ ने दो विकेट पर 313 रन बनाकर जीत दर्ज की। करूण और यश ने दूसरे विकेट के लिए 228 रन की विशाल साझेदारी निभाई। इस जीत से विदर्भ पांच मैच में 20 अंक लेकर ग्रुप डी में शीर्ष पर पहुंच गया। तमिलनाडु (14 अंक) दूसरे स्थान पर और उत्तर प्रदेश (14 अंक) से तीसरे स्थान पर है।
गौरतलब है कि 33 साल के करुण नायर ने भारत के लिए छह टेस्ट और दो वनडे मैच खेले हैं। टेस्ट क्रिकेट में तिहरा शतक बनाने के बावजूद उन्हें ज्यादा मौके नहीं मिले। नायर को पिछले नवंबर में IPL-2025 मेगा ऑक्शन के दौरान दिल्ली कैपिटल्स ने 50 लाख रुपये में खरीदा है। वह दो साल बाद आईपीएल खेलेंगे। अब रिकॉर्ड तोड़ रन बनाने वाले इस क्रिकेटर पर सबकी नजरें होगी।
Also Read-
చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్
హైదరాబాద్ : విదర్భ జట్టు సారధి కరుణ్ నాయర్ విజయ్ హజారే ట్రోఫీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ చేసిన కరుణ్ (101 బంతుల్లో 112; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) లిస్ట్-ఏ (50 ఓవర్ల ఫార్మాట్) క్రికెట్‌లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. కరుణ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో ఔట్ కాకుండా 541 పరుగులు చేశాడు.
గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ పేరిట ఉండేది. ఫ్రాంక్లిన్ లిస్ట్-ఏ క్రికెట్‌లో ఔట్ కాకుండా 527 పరుగులు చేశాడు. కరుణ్, ఫ్రాంక్లిన్ తర్వాత ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వాన్ హీర్డెన్ (512) ఉన్నాడు. యూపీతో మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన కరుణ్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు చేశాడు. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అజేయ సెంచరీ (112) చేసిన కరుణ్.. ఆతర్వాత చత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 44 పరుగులు చేశాడు.
ఆతర్వాత కరుణ్ వరుసగా చంఢీఘడ్ (163 నాటౌట్), తమిళనాడు (111 నాటౌట్), ఉత్తర్‌ప్రదేశ్‌లపై (112) హ్యాట్రిక్ సెంచరీలు చేశాడు. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. కరుణ్ 5 ఇన్నింగ్స్‌ల్లో 542 సగటున 542 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కరుణ్ 115.07 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. కరుణ్ సూపర్ సెంచరీతో మెరవడంతో యూపీపై విదర్భ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో విదర్భకు ఇది వరుసగా ఐదో విజయం. విదర్భతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. సమీర్ రిజ్వి (82 బంతుల్లో 105; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు శతకం బాదాడు. కెప్టెన్ రింకూ సింగ్ (6) విఫలమయ్యాడు. విదర్భ బౌలర్లలో నచికేత్ భూటే నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన విదర్భ 47.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరుణ్ నాయర్‌తో పాటు యశ్ రాథోడ్ సెంచరీ చేశాడు. యశ్ 140 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్ సాయంతో 138 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యూపీ బౌలర్లలో రింకూ సింగ్, బిహారీ రాయ్ తలో వికెట్ పడగొట్టారు. (ఏజెన్సీలు)