Crime: రేవంత్ రెడ్డి కొత్త పార్టీ! దుష్ప్రచారం చేస్తూ జర్నలిస్ట్ శంకర్ ట్వీట్, పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ కొత్త పార్టీ పెడుతున్నారని దుష్ప్రచారం చేస్తూ జర్నలిస్ట్ శంకర్ ట్వీట్ చేయడం పై పలు పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులు చేసారు. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాతూ…

కాంగ్రెస్ పార్టీ పైన, నాయకులపైన దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాం. ఈ రోజు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారని జర్నలిస్ట్ శంకర్ ట్వీట్ చేసిన అంశంలో ఫిర్యాదు చేసాము. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపైన పార్టీ పైన ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా ఊరుకొము.

టీపీసీసీ అధ్యక్షులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిపై ట్విట్టర్లో తప్పుడు ఆరోపణ చేసిన న్యూస్ 9 యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టు శంకర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి.

టీపీసీసీ అధ్యక్షులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు కొత్త పార్టీ పెడుతున్నట్లు పార్టీ పేరు తెలంగాణ సామాజిక కాంగ్రెస్ పార్టీగా నామకరణం చేసినట్లు చెప్పు ప్రచారం చేస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన జర్నలిస్టు శంకర్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్లో పెడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను తప్పుదారి పట్టించే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని

బలోపీతం చేయడానికి ప్రయత్నిస్తున్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న జర్నలిస్టు శంకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని జర్నలిస్టు శంకర్ పై కేసులు నమోదు చేయాలని ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్సై రామకృష్ణ గారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది.

ఫిర్యాదు చేసిన వారిలో టిపిసిసి కో ఆప్షన్ సభ్యులు- బాస వేణుగోపాల్ యాదవ్, కొంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరి ప్రశాంత్ గౌడ్.
బైరి శ్రీనివాస్ గౌడ్,ఆదిరెడ్డి సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

We are condemning the fake news of starting a new party by Revanth reddy. This is a fake news to damage the congress party. I am forwarding this fake news to cyber crime police to take serious action. Dr mallu ravi, ex mp& tpcc Vice President.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X