Chingar : का बहुत बड़ा दिल, ‘उस’ समय महिलाओं के लिए सवैतनिक अवकाश

हैदराबाद : भारतीय सोशल मीडिया चिंगारी (Chingari) ने एक बड़ा फैसला लिया है। महिलाओं के सामने आने वाली कठिनाइयों का सामना करने और उन्हें सशक्त बनाने के लिए बड़े दिल से सोचा है। ‘उस’ विशेष अवसर पर महिलाओं के लिए वैतनिक अवकाश की घोषणा की। अब प्रति माह 2 दिन अवकाश लिया जा सकता है।

इंडियन ऑन-चेन सोशल ऐप, चिंगारी ने 6 मार्च को एक महत्वपूर्ण निर्णय लिया। महिला कर्मचारियों को माहवारी के दौरान दो दिन का सवैतनिक अवकाश देने की घोषणा की। कंपनी ने घोषणा की कि नई नीति तुरंत प्रभावी होगी। चिंगारी ने घोषणा की कि मासिक धर्म के दौरान महिलाओं को होने वाली कठिनाइयों को ध्यान में रखते हुए स्वास्थ्य को प्राथमिकता देने के लिए महिलाओं को सशक्त बनाने का निर्णय लिया गया है। महिलाओं के स्वास्थ्य और कल्याण के लिए मासिक धर्म अवकाश की शुरुआत इसके व्यापक प्रयास का एक हिस्सा है।

Chingari: కంపెనీ గొప్ప మనసు, మహిళలకు ఆ టైంలో వేతనంతో కూడిన సెలవు

హైదరాబాద్ : భారత్‌కు చెందిన సోషల్ మీడియా కంపెనీ చింగారి (Chingari) గొప్ప నిర్ణయం తీసుకుంది. మహిళలు పడే ఇబ్బందులను ఎదుర్కొని, వారికి మరింత శక్తి నిచ్చేలా గొప్ప మనసుతో ఆలోచించింది. ఆ ప్రత్యేక సమయంలో మహిళలకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. మళ్లీ నెలకు 2 రోజులు తీసుకోవచ్చు.

ఇండియన్ ఆన్- చెయిన్ సోషల్ యాప్, చింగారి మార్చి 6న కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు రుతుక్రమం (menstruation) సమయంలో 2 రోజులు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. కంపెనీ కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. పీరియడ్స్ సమయంలో మహిళలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, వారు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చేలా వారికి శక్తినిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది చింగారి. మహిళల ఆరోగ్యం, సంక్షేమం కోసం రుతుక్రమ సెలవును తీసుకురావడం దాని విస్తృత ప్రయత్నంలో ఒక భాగం.

ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు చింగారి రుతుక్రమ సెలవును స్వీకరించడం అనేది మహిళల ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం దాని విస్తృత ప్రయత్నంలో ఒక భాగం. #GARI4NARI ద్వారా, ఆపదలో ఉన్న మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా భారత మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన #GARI4NARI అనే సోషల్ మీడియా క్యాంపెయిన్‌ చింగారికి ప్రేరణ కలిగించిందంట. 2022లో ప్రారంభమైన ఈ ఇనిషియేటివ్ ద్వారా వేలాది మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారు.

మహిళలకు పని ప్రదేశంలో సాధికారత కల్పించడం ప్రాధాన్యం అర్థం చేసుకున్నట్లు చెప్పారు చింగారి కో ఫౌండర్, సీఈఓ సుమిత్ ఘోష్. వారికి మరింత మద్దతు కల్పించేందుకు, వారు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు మరింత సహకరించనున్నట్లు దానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇక మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా చింగారి ఉమెన్స్ బైక్ ర్యాలీ కూడా నిర్వహించనుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X