సంగీతానికి శిశువులు పశువులు చెట్లు చీమలు స్పందించడాన్ని పూర్వం నుంచి పెద్దలు చెబుతున్నారు ఏ ప్రాంతం వారు చెవులకు సుస్వరాలు, సుమధుర తాళగతులు తరచుగా వినిపిస్తుంటాయో వారు సంగీతానికి చక్కగా స్పందించిస్తారనటం సబబుగా ఉంటుంది. నేను పుట్టి, పెరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో అటువంటి భాగ్యమే లభించింది నాకు.
తెలంగాణ కళలకు కాణాచి అందులో అదిలాబాద్ ఒకప్పటి గొండ్వానా లాండ్ ప్రత్యేకమైనది. ఈ నాగరికత చరిత్రకు సాంస్కృతిక వారసత్వం ఆయువు. అతిపురాతన జీవనాగరికత ఒడిసిపట్టుకుని తరాల తరాలుగా ఉంది. కొన్ని వేల ఏళ్లుగా ఇక్కడ గోండు, కొలామీ, పరధాన్ల, తోటి కథాగాయకులు సంగీతం వాయిద్య కళాకారులు, సహజమైన ప్రకృతి మనుషులు సాంప్రదాయ సంగీత పరికరాల వాయిద్యకారులతో అడవి ఆకులు సంగీతానికి మురిసిపోతాయి. అంతటి సంగీతజ్ణానం, సంగీతం రసజ్ఞత కలిగిన వారున్నారు. తరతరాల నుంచి చూసి నేర్చుకోవడం, అభ్యాసం చేయడం ఆదివాసీ సమూహాల లక్షణం. ఇదే వారి జీవితాలను అర్థవంతమైనదిగా నడిపిస్తుంది.
“సోల దిమ్స అట్రా వాజ్య 18 వాద్యాలు,16 నృత్యాలు” వీటి చుట్టూ ఆదివాసి కథగానాలు, సంగీతం రేలా రేలారే పాటల ఆదివాసి స్త్రీల పాటలు ఉంటాయి. మానవ పుట్టుక క్రమానుగతంగా వంశాభివృద్ధి జానపద కథల్లో ముడిపడి ఉంటుంది. దక్కన్ గొండుల రాజ్యంలో, కొండ కోనల్లో కొత్త సంగీత కళాకారులకు ఈ అడవి పూలు పరిచింది. అది వర్షాల జిబజిబ కాలమే. ఆ చినుకులు కూడా సంగీతమే పాడుతుంది. ఆదివాసీ గ్రామాలు వాగులతో, జలపాతాలతో సంగీతం ఝరితో ఊయలుగుతున్నాయి. అయినా ఆదివాసీ గ్రామాలు సహజమైన మనుషులు తిరుగుతున్నారు. వాళ్ళ జీవితాల్లో మార్కెట్ లేదు. వ్యక్తిగత ఆస్తి భావన లేదు ఉన్నదోక్కటే అమాయకంగా వారి పనేదో చూసుకోవటం అంతే. మానవ జీవితానికి ఏమి కావాలో ఎంత కావాలో జ్ణానంతో జీవించడం వారికి తెలుసినంత ఎవరికి తెలియదు.
ఇది కూడా చదవండి
భారతదేశంలో సాంస్కృతిక వైవిద్యం ఉంది. అందులో దక్కన్ గొండుల రాజ్యం అతి పురాతనమైన జీవనాగరికత ఉంది. అలాంటి దక్కన్ గొండుల ప్రాంతంలో 2021 సెప్టెంబర్, 10వ తేదీ నుంచి “చౌరస్త బ్యాండ్”, వాహనాలు నిండా గిటార్, జాజ్ మరియు వివిధ సంగీత పరికరాలు మ్యూజిక్ సిస్టమ్ వేసుకుని చలో చలో ఇయ్యాల మంచిరోజు, నీకు నువ్వే రాజు ఈ చిన్న గుండెలో నా ఎందుకింత గాబరా లోకమంతా వెలుగునింపరా” బస్కీంగ్ మొదలు పెట్టారు. వినేవారు ముఖంలో ఆనందం. చుట్టూ చేరిన జనం కొత్తలోకం చూస్తున్నారు. భారతదేశంలో అతి తక్కువ మంది చేశారు. ఆ తక్కువ మందిలో ఈ బ్యాండ్ ఉండటం విశేషం. కార్పోరేట్, మోడ్రన్ ఈవెంట్ చేస్తూ బ్యాండ్ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా స్థానికత కళలు ఎదగాలి అనీ, ఊరు ఊరు తిరుగుతూ కళలను పంచి, కళాకారులకు చేయూతనివ్వడం ఈ తెలుగు రాష్ట్రంలోనే ఇదే మొదటిది. ఇది ఒక సంగీతం ఒక ప్రేరణ, ఒక పయోనీర్. మాములుగా సంగీత దర్శకులంతా నగరాల్లో, పట్టణంలో స్టూడియోలో కంపోజ్ చేస్తారు. కానీ ఈ బ్రృందం చాలా రూటెడ్, గ్రామాలు ప్రజలకు వద్దకు పోయి సంగీతం వినిపిస్తూ, సంగీతం రసికులకు ఆనందం కల్గిస్తున్నారు. వీరంతా “సూర్ వేడ్య” సంగీతం స్వరాలు పిచ్చోళ్ళన్నమాట.
ఆదివాసీ సంప్రదాయాలు, పురాతన సంగీత వాయిద్యా పరికరాలు కిక్రి, కాలికోం, డప్పు, పర్ర, డోల్కి తుడుం, వెట్టె పండుగలకు, జాతరలకు ఉపయోగిస్తూ జానపద సంగీతం కాపాడటం ఒక జాతి ఉన్నత విలువలుగా ఉంటుంది. కొద్దిగా మైదానం ప్రాంతం కళాకారులతో ఆడి పూర్తిగా ఆదివాసీల జాడను వెతుక్కుంటూ, అలా మున్నూరు కిలోమీటర్ల ఆవల పెద్ద వాగు నీటి అలలకు సంగీతం జ్ణానం నేర్పించాలని అడవి లోపలి గ్రామాలకు బయలు దేరారు. అక్కడి ప్రజలతో మమేకమై పాటలతో జతకట్టారు. వారు పాడుతుంటే వారి ట్యూన్ లోకల్ ఓన్ లిరిక్స్ కలిపి పాడటం విశేషం, ట్రైబల్స్ అయితే చప్పట్లుతో మేము మీ సంగీతం “రాం రాం” అన్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. అదేందో ఎవ్వరికి కొత్త అనిపించలేదు. అంత కలసిపోయారు. ట్రైబల్ మ్యూజిషన్స్ గొంతు విప్పారు. టి వి షోలో పాడే గాయని గాయకుల కన్నా వందరెట్లు సంగీతం జ్ణానం ఉన్నది. వారందరికీ సంగీతం ప్రపంచాన్ని ఏలాలనుంది కానీ ఒక దారి లేదు ఆ దారిని వేయ్యడమే బస్కీంగ్.

ఆదిలాబాద్, డాక్టర్ సామల సదాశివ, “స్వర లయలు” కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అది హిందుస్తానీ, ఉపశాస్రీయ, శాస్త్రీయ సంగీతం గురించి ఉంది కానీ, ఇక్కడ ఆదివాసీ మ్యూజిక్ గురించి పుస్తకాలు ఏమిరాలేదు. దీన్ని నేను ఒక అధ్యయనం భావించాను. గొండు గ్రామాల సంగీతం మీద ఆసక్తితో వారితో ప్రయాణం చేశాను. ఎక్కువగా ఈ కార్యక్రమం ద్వారా మరింత అనుభవాలు నేర్చుకున్నాను. గత పదేళ్లుగ ఆదివాసీ ప్రాంతాల్లో మనుషులు గమనించడం వల్ల భాష, సంగీతం నా రక్తంలో కలసినాయి. ఆసిఫాబాద్ ప్రాంతంలో ఒకప్పుడు మధురక చార్య, వసంత మసాజ్ నారాయణరావు తమతమ గాన కళను వినిపించేవారు. అదిప్పుడు లేదు. తోటి, పరధాన్ల కథా గాయకుల సంగీతంతో వీరగాధలు జన్మవంశ వ్రృత్తాంతాలు చెబుతారు. ప్రిమిటివ్ ట్రైబల్ వెడ్మ రాము, తోటి పెద్దమనిషి కిక్రి అంటే (వయోలిన్ వంటి సంప్రదాయ గొండి కిక్రి వాయిద్యం)తో ఐదు రోజుల పాటు పాట సాగటం మరియు ఆ జ్ణాపకశక్తి ఒక తోడ్పడే నిశితమైన125 గులకరాళ్ళతో శాస్త్రీయ అవగాహన కలిగివుండటం మరింత ఆశ్చర్యం గురిచేసిందని మైఖేల్ యార్క్ తన వ్యాసంలో రాశాడు.

ఇప్పుడు మరో రెండు దశాబ్దాల తర్వాత తెలంగాణలో ఆదిలాబాద్ల గొండి, కొలామీ తెగ భాషలు ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. తెలంగాణల స్థానిక భాష తెలుగు తప్ప వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భాష అంతరిస్తే, సాంస్కృతిక ప్రగతి ముందుతరాలకు చారిత్రక గీతాలు, సంగీతం ఉనికి పోతుంది. ఇలాంటి ఒక సమయంలో మా ఆదివాసుల సాంస్కృతిక పునరుజ్జీవనం మద్దతుగా “బస్కింగ్” చేయడం చాలా గొప్ప విషయం. ట్రైబల్ సంగీతం కళాకారులు ఆనందపడేది. రాజుగోండ్సులో రాచరిక చాయలు కనిపిస్తుంది. వీరులగాధల పాటలు తెలుసుకోవడం మరింత స్పష్టమైన అవగాహన కలిగింది ఈ ప్రోగ్రాంలో. అంతేగాకుండా యశ్వంత్ నాగ్, ఈ బస్కింగ్ ద్వారా వచ్చిన ఆదాయం ఇక్కడి కళాకారులు అభివృద్ధి సహకారం చేస్తానని హామీ ఇవ్వడం కళల మీద ప్రేమ కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గొండి భాష పాటలు పక్కనున్న మహారాష్ట్రలో తీసుకెళ్ళి మ్యూజిక్క్ చేస్తారు అది చేయడం వల్ల ఒరిజినల్ గొండ్వానా పాటలు అస్థిత్వాన్ని కోల్పోతుంది. అందుకే ఇక్కడ ఒక మ్యూజిషన్స్ ఒక స్టూడియో పెట్టాలన్న కాంక్ష కూడా ఉంది.

ఉమ్మడి అదిలాబాద్ సంస్కృతిని మనుషులను జీవితాలను అర్థం చేసుకోవడానికి కొత్త ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ప్రత్యేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాంస్కృతి ఆదివాసి కళల మీద అతి తక్కువ డాక్యుమెంటరీ వచ్చాయి. అసలు లేవని చెప్పాలి. మూడురోజులు పన్నెండు ప్లేసులో చేసినదంతా వీడియో తీసారు. జూలై 21వ తేదీన, శుక్రవారం 18 నిమిషాల 25 సెకండ్ల నిడివి గల “బస్కింగ్ వీడియో డాక్యుమెంటరీ” రిలీజ్ అయింది. ఇలాంటి వీడియో డాక్యుమెంటరీ మొదటిది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి రాహుల్ సిప్లిగంజ్, మై విలేజ్ షో, అనురాగ్ కులకర్ణి, క్రృష్ణ చైతన్య వీరంతా అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ట్రైబల్ మ్యూజిషన్స్, ఆదివాసి కళాకారులు తెలంగాణ నుంచే దేశ విదేశాల్లో నుంచి వీడియోకి చిత్రానికి ప్రశంసలతో పాటు “బిమోని రాప్సడి” డాక్యుమెంటరీ తలపించింది అని ప్రశంసించారు.
చాలామంది గోండు, కొలాం, తోటి యువతీ యువకులు వెడ్మ రాం, మెస్రం రవి, ఆనంద్ మరికొంత మంది మ్యూజిక్ పట్ల అమితాసక్తి ఉంది కానీ వారందరికీ ఒక తోవ కావాలి. అది చౌరస్త బ్యాండ్ చూపిస్తుందని నమ్మకం ఉంది.తెలంగాణ ఇప్పుడు సజీవ జీవన సంగీతం ట్రైబల్ మ్యూజిషన్స్ వారసత్వం సంపదగ చూడాలే. అంతేగాకుండ మేధావులు, కళాకారులు, రాజకీయ నాయకులు కళ ఉన్నతికి పాటుపడాలె. తెలంగాణలో కల్చర్ మ్యూజిక్ ప్రదర్శనలు “చౌరస్తా బ్యాండ్ బస్కింగ్” ఇంకా గ్రామా గ్రామాలలో జరగాలే. తెలంగాణలోని “బస్కీంగ్” యాత్ర భారతదేశంలోనే కాక ప్రపంచమంతా విస్తరించి ఒక మైలురాయిగ నిలిచిపోతుంది. ఆదిలాబాద్ మరింత గొప్ప అధ్యయనం చేయమని ఈ మట్టితల్లి నన్ను కౌగిలించుకుంటుంది. కొత్తగా ప్రపంచాన్ని నిర్మాణం చేసే వారితో నా అనుభవం, అధ్యయనం ఎప్పటికీ అందిస్తాను.

అక్కల్ చంద్రమౌళి పరేషాన్ సినీ గీత రచయిత