సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ, ఎందుకంటే…

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఇంకెంత కాలం?

మీ వైఖరితో బీసీలకు తీరని అన్యాయం

రిజర్వేషన్ల పెంపును విస్మరిస్తే ఊరుకోబోం

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాల్సిందే

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు.

ఈ మేరకు గురువారం నాడు ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. బీసీలకు ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి 2024-25 బడ్జెట్ లో అరకొర కేటాయింపులు చేసి తొలి ఏడాదే కామారెడ్డి డిక్లరేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఉల్లంఘించారని విమర్శించారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీసీ వర్గాల్లో ఏ మాత్రం విశ్వాసం లేదని, ఈ వైఖరితో రాష్ట్రంలో బీసీలంతా తీరని అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

“కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రధాన హామీ అయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడం. “కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీలకు రిజర్వేషన్ల పెంపు” అని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో స్పష్టంగా పేర్కొని ఉంది. 6 నెలలు గడిచాయి… ఏడాది గడిచింది.. అయినా కూడా రిజర్వేషన్ల పెంపునకు అతీగతీ లేదు. అశాస్త్రీయంగా బీసీ గణన నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేయడమే మీ ఆలోచనగా కనిపిస్తోంది.” అని తెలిపారు.

Als Read-

కుల గణన పూర్తయ్యి కూడా చాలా కాలం అవుతుందని, కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ వివరాలను బహీర్గతం చేయలేదని ఎండగట్టారు. ఆ వివరాలను తక్షణమే బహీర్గతం చేయాల్సిన అవసరం ఉందని, డెడికేటెడ్ కమిషన్ నివేదిక సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. “ బీసీల అంశాల పట్ల మీ ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తోంది ? బీసీలంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చులకన ? 6 నెలల్లోపే అమలు చేస్తామన్న హామీ 12 నెలలు గడిచినా ఎందుకు అమలు చేయడం లేదు ? హామీని అమలు చేయడానికి ఇంకెంత కాలం పడుతుంది ?” అని ప్రశ్నల వర్షం కురిపించారు.

రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాది పూర్తయ్యిందని, మండల, జిల్లా పరిషత్ ల పదవీకాలం కూడా ముగిసిందని, ప్రస్తుతం గ్రామాల్లో ప్రజా పాలన కాకుండా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోందని వివరించారు. కానీ మీ ప్రభుత్వానికి త్వరగా రిజర్వేషన్లను పెంచి ఎన్నికలను నిర్వహించాలన్న సోయి లేనట్లు అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు.

బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాల్సిందేనని తేల్చిచెప్పారు. కుంటి సాకులు చెప్పి ఇచ్చిన మాట కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే మాత్రం తెలంగాణ సమాజం మిమ్మల్ని సహించబోదని, బీసీల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ మీ మెడలు వంచి హామీని అమలు చేయించుకుంటామని హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను తక్షణమే 42 శాతానికి పెంచడానికి చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

BRS MLC Kalvakuntla Kavitha’s open letter to CM Revanth Reddy

Hyderabad: In a strongly-worded letter to Chief Minister A Revanth Reddy, Bharat Rashtra Samithi (BRS) leader and MLC K Kavitha on Thursday demanded that reservations for BCs be increased to 42% at any cost, as promised in the Kamareddy BC Declaration issued by his party, the Congress, ahead of the 2023 Assembly elections. Recalling that the Congress’ Kamareddy Declaration was one of its main poll planks, she criticized the party for failing to implement any of its promises, such as increased reservations for BCs and financial assistance to handicraft and manual workers.

“You undermined and violated your own Kamareddy Declaration in your very first year in office by allocating a meagre amount in the 2024-25 Budget contrary to your promise of Rs one lakh budgetary allocation in five years or in other words, Rs 20,000 crore per year for the welfare of BCs. This is just one example that reinforces the fact of the Congress history of unfulfilled promises,” the BRS MLC said and asserted that BCs have no confidence in the Congress. “They are being subjected to severe injustice under your government,” she added.

Kavitha lashed out at the Congress government for also failing to increase reservations for BCs to 42% in local bodies, which is one of its main promises in the BC Declaration. “The Declaration clearly stated that the BC quota in local bodies will be hiked based on caste census and BC commission report within six months of coming to power. Six months went by and now, a year has gone by but nobody knows the fate of the BC quota. It appears that the government’s intention is to delay everything in the name of an unscientific caste census and a dedicated commission,” the senior BRS leader said.

The former MP from Nizamabad stressed the need to make public details of the caste census as it has been a long time since it was completed and demanded that the government give clarity on its next steps as reports are coming in about an imminent dedicated commission.

She sought to know the reason for government apathy towards BCs’ problems. “Why does the Congress look down upon BCs? Why were promises not implemented even after 12 months after claiming to implement within six months? How long will it take?” she questioned.

The BRS MLC further reminded the Chief Minister that it has been almost a year since the tenure of gram panchayats lapsed. Same is the case with zilla parishads, she pointed out and said currently, special officers’ rule has replaced democracy in villages. “But the government has no sense, it seems, to swiftly increase reservations and hold elections,” Kavitha said.

She demanded that reservations for BCs must be hiked to 42 % at any cost and warned that Telangana will not tolerate it if the promised quota was not implemented by citing lame excuses. The BRS, which is championing the cause of BCs, will force you to implement all the promises, she said and demanded that steps to hike the quota for BCs be expedited immediately.

Kavitha also reminded the government about the long-standing request to install a statue of Jyotirao Phule in the Assembly premises. She recalled personally bringing this matter to the attention of Telangana Speaker Gaddam Prasad a year ago, but unfortunately, no action has been taken since.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X