హైదరాబాద్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయవాది, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు సుభాష్ చంద్రబోస్ జన్మదినం (పరాక్రమ దివస్) సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ… జాతికి స్ఫూర్తినిచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ప్రపంచ వీరుడిగా చరిత్రలో నిలిచిన నేతాజీ, తన స్వేదంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, సింగపూర్‌లో తొలిసారి భారత స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన గొప్ప నాయకుడు. సుభాష్ చంద్రబోస్ ప్రపంచాన్ని ఎదురించి, జయించి, కొంతమంది నాయకుల చేసిన కుట్రలను ఛేదించారు.
కలకత్తా నుంచి బయలుదేరి, దేశ విదేశాల్లో పర్యటించి, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త ఊపిరిని నింపారు. యన ఆశయాలు, ధైర్యసాహసాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆయన త్యాగాలు, సేవలు భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయి. భారతీయ జనతా పార్టీ తరఫున నేతాజీ చేసిన సేవలను స్మరించుకుంటాం. ఆయన త్యాగాలు, సేవలను చరిత్రలో మళ్లీ లిఖించి, భవిష్యత్ తరాలకు ఆగమనంగా బోధిస్తూ, ఆ మహనీయుడి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకునే విధంగా కృషి చేస్తాం.
Also Read-
ఈ కార్యక్రమంలో పార్టీ (సంఘటన) ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాజస్థాన్ రాష్ట్రం దౌస నియోజకవర్గం శాసనసభ్యులు భాగ్ చంద్ సైని తదితరులు పాల్గొన్నారు.