మహారాష్ట్రలో మార్చి 26న BRS భారీ బహిరంగ సభ, ఏర్పాట్లను పరిశీలించిన జీవన్ రెడ్డి (Video)

-పాల్గొననున్న పార్టీ అధినేత కేసీఆర్

-బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-మహారాష్ట్ర నేతలతో సభాస్థలం సందర్శన

-గౌరవ సీఎం కేసీఆర్ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష

-దేశానికి బీజేపీ శాపం.. బీఆర్ ఎస్సే ఆశాదీపం

-అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ ఎస్ లక్ష్యం

-తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశమంతా అమలు

-పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉద్ఘాటన

-గౌరవ సీఎం కేసీఆర్ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష

-దేశానికి బీజేపీ శాపం.. బీఆర్ ఎస్సే ఆశాదీపం

-అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ ఎస్ లక్ష్యం

-తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశమంతా అమలు

-ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

आरमूर: बीआरएस पार्टी ने इस महीने की 26 तारीख को महाराष्ट्र के कंदरलोहा में एक विशाल जनसभा आयोजित करने का फैसला किया है। बीआरएस पार्टी के प्रमुख और मुख्यमंत्री केसीआर की अध्यक्षता में होने वाली इस बैठक में महाराष्ट्र के प्रमुख नेता हिस्सा लेंगे। इस दौरान सैकड़ों लोग बीआरएस में शामिल होंगे।

ఆర్మూర్ : మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న భారీ బహిరంగ సభ నిర్వహించాలను బీఆర్ ఎస్ పార్టీ నిర్ణయించింది. బీఆర్ ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సభలో మహారాష్ట్రకు చెందిన కీలకనేతలు పాల్గొననున్నారు.

కాగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. మహారాష్ట్ర నేతలతో కలిసి ఆయన సభాస్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సభ స్థలం ఎంపిక, బహిరంగ సభకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి జీవన్ రెడ్డి స్థానిక నేతలతో చర్చించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ సీఎం కేసీఆర్ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. దేశానికి బీజేపీ శాపంలా మారిందని, లక్షల కోట్ల రూపాయల విలువ గలా ప్రభుత్వ రంగ ఆస్తులను అదానీ వంటి వారికి దోచిపెడుతోందని ఆయన మండిపడ్డారు. బీఆర్ ఎస్సే దేశానికి ఆశాదీపమని, ప్రజల ఆకాంక్షలు తీర్చకలిగిన మనసున్న మహానేత కేసీఆర్ గారేనని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ ఎస్ లక్ష్యమని, ఆదర్శవంతమైన తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశమంతా అమలు చేయాలన్నదే కేసీఆర్ గారి కృతనిశ్చయమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ విధానాలు, పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ దార్శనికత దేశ ప్రజలతో పాటు, రాజకీయాల్లో తలపండిన వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులను సైతం ఆకట్టుకుంటున్నది. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా యావత్ దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా రూపుదిద్దుకున్న బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలు నచ్చి ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు పలు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.

ఇటీవల జరిగిన నాందేడ్ సభ పెద్ద ఎత్తున విజయవంతమై భారతదేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారి చర్చకు దారితీసింది. భారత ప్రజల కోసం, వారి అభివృద్ధి సంక్షేమం కోసం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పడుతున్న తపన, ఆయన దార్శనికతను మహారాష్ట్ర సహా, ఉత్తర భారత ప్రజలు అర్థం చేసుకున్నారు. తెలంగాణలో విప్లవాత్మక రీతిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

కేసీఆర్ గారిలాంటి ముఖ్యమంత్రి తమకూ ఉంటే బాగుండునని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.
అలాంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా కార్యరూపం ఇవ్వాలని సీఎం కేసీఆర్ గారు తెలంగాణతో పాటు యావత్ దేశ ప్రజల అభివృద్ధికి నడుం బిగించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారి వంటి గొప్ప నాయకునికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడం ద్వారా, తమ జీవితాల్లో గుణాత్మక మార్పుకు తామే నాంది పలకాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్టుగా నాందేడ్ సభ సాక్షిగా ఇప్పటికే స్పష్టమైంది.

ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ హిమాన్షు తివారి, బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర కిషన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం ప్రవీణ్, శివాన్క్, అంకిత్ యాదవ్, గణేష్ బాబు రావు కదం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X