BRAOU : సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఉపకులపతుల రౌండ్ టేబుల్ సమావేశం

ఉన్నత విద్యలో జీఈఆర్ పెంచడంలో ఓపెన్ యూనివర్సిటీలే కీలకం : ప్రొ. లింబాద్రి

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయo, కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా (CEMCA) ఆధ్వర్యంలో – ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఫెస్ట్ లో భాగంగా “దేశంలోని సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఉపకులపతుల రౌండ్ టేబుల్ సమావేశం” ముగిసింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలోని అన్ని సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొని విద్యార్ధులకు ఉపయోగపడేలా నాణ్యమైన పాఠ్యాంశాల రూపకల్పనకు OER సరికొత్త పాలసీ విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, విద్యార్ధికి సులువుగా అర్ధం అయ్యేలా పాఠ్యాంశాలు, ఆకర్షణీయమైన బోధన, నిరంతర మూల్యాంకనంతో పాటు విద్యార్ధికి ఆయా విద్యా సంస్థలు జవాబుదారీగా ఉండేలా విధానాలు రూపొందించి అమలు చేయాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మూడు రోజుల పాటు నిర్వహించిన OER ఫెస్ట్ లో భాగంగా చివరి రోజు కార్యక్రమంలో అన్ని సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్నా స్థూల జాతీయ సగటు కంటే తెలంగాణలో ఎక్కువగా నమోదు అయ్యిందని దానికి డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కారణమని వివరించారు. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా జీ ఈ ఆర్ పెంచడంలో ఓపెన్ యూనివర్సిటీలే కీలక పాత్ర పోషించనున్నాయని వెల్లడించారు. విద్యార్ధులకు అందించే కోర్సు మెటీరియల్ పరిమాణంలో మాత్రమే కాకుండా నాణ్యమైన కోర్సులు రూపొందించడం కూడా చాలా అవసరమని వివరించారు. నాణ్యమైన మెటీరియల్ తయారు చేయడంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ముందంజలో ఉందని వివరించారు. గ్రామీణ ప్రాంతానికి ఉన్నత విద్యను విస్తరించడానికి సార్వత్రిక విశ్వవిద్యాలయాలు విశేషంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామరావు తన ముగింపు ప్రసంగంలో, సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. కార్యక్రమంలో ఆన్లైన్ లో జాయిన్ అయిన నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సివిఇటి) సంస్థ చైర్మన్ డా. నిర్మల్జీత్ సింగ్ కల్సి మాట్లాడుతూ స్కిల్ కోర్సుల నుంచి 50% క్రెడిట్‌లు పొందవచ్చని చెప్పారు. ఎన్‌సివిఇటి 7300కి పైగా కోర్సులను రూపొందించింది, డిజిటల్ కంటెంట్ సృష్టి, సరైన పద్ధతిలో వినియోగించుకోవడం, ఐసీటీ ని విరివిగా వాడడం వంటి వాటిపై సార్వత్రిక విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాలని సూచించారు.

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (న్యూఢిల్లీ) ఉపకులపతి ప్రొ.కె నాగేశ్వర్ మాట్లాడుతూ దేశంలోని సార్వత్రిక విశ్వవిద్యాలయాలు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సివిఇటి)లో సభ్యత్వం పొందుంటే, వాటికి ఎఐసిటిఇ అనుమతి అవసరం లేదని అన్నారు. విద్యార్థులకు స్వయం ప్రభ ఛానెల్‌లు గురించి అవగాహణ పూర్తి స్థాయిలో లేదని ఈ అంశాన్ని విరివిగా విద్యార్ధి లోకానికి పరిచయం చేయాలని సూచించారు. ఇందులో 40 స్వయం ప్రభ ఛానెల్‌లు ఉండగా 4 ఛానెల్‌లు పూర్తిగా విద్యార్ధులకు ఉపాధి శిక్షణ కొరకే ఉన్నాయన్నారు. ఇవి 2017 నుంచి విద్యార్థుల సంక్షేమం కోసం అందుబాటులో ఉన్నాయన్నారు.

CEMCA డైరెక్టర్ డా. బి. శాద్రచ్ మాట్లాడుతూ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఫెస్ట్ నిర్వహణ, ఆవశ్యకతను, పాలసీల రూపకల్పనలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు ఆయన స్వాగతం పలికారు. దేశంలో 50% GERకి చేరుకోవాలంటే, ఆ లక్ష్యం సార్వత్రిక విశ్వవిద్యాలయల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. జాతీయ స్థాయిలో అన్ని ఓపెన్ యూనివర్శిటీల అధికారులు రెండు రోజుల పాటు చర్చించిన అంశాలను ఆయన సభ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో సార్వత్రిక విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ లు ప్రొ. అమీ ఉపాధ్యాయ (గుజరాత్), ప్రొ.కర్మన్ జీత్ సింగ్ (పంజాబ్), ప్రొ. సాహు (ఝార్ఖండ్); ప్రొ. శరనప్ప (కర్ణాటక), ప్రొ. ఆర్.పి. దాస్ (అస్సాం), ప్రొ. సంజయ్ తివారి (భోపాల్), ప్రొ. ఏ.కె.దాస్ మహాపాత్ర (భువనేశ్వర్), డా. బన్స్ గోపాల్ సింగ్ ( ఛత్తీస్గఢ్), ప్రొ. జగతి రాజ్ (కేరళ), ప్రొ. అరుముగం ( తమిళనాడు), ప్రొ. ఓం ప్రకాష్ సింగ్ నేగి (ఉత్తరాఖండ్), ప్రొ. సంజీవ్ సోనావని (నాసిక్), ప్రొ. దేవికా మడాలి (యూజీసీ న్యూఢిల్లీ), పలు జాతీయ స్థాయి విద్యాసంస్థల సీనియర్ అధికారులు, అంబేద్కర్ విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి, COEL డైరెక్టర్ ప్రొ. లక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Open universities are key in increasing GER in higher education : Prof. Limbadri, Chairman, TSCHE

Round Table Conference of Vice-Chancellors of Open Universities concluded at BRAOU

Hyderabad: Dr. B. R. Ambedkar Open University in collaborations with Commonwealth Educational Media Centre for Asia (CEMCA) organized “All India Open Universities Vice-Chancellors Roundtable Meet” as a part of OER Fest at Dr. B.R. Ambedkar Open University Campus, Hyderabad on Saturday.

In this prestigious event, the vice-chancellors of all the open universities of the country participated and said that the new policy of OER, New Education Policy 2020, for the design of quality curriculum for the benefit of the students, Curriculum that is easy to understand for the students, engaging teaching, continuous evaluation and the policies to make the educational institutions accountable to the students should be designed and implemented. As part of the three-day OER Fest, the last day program was attended by the Vice-Chancellors of all open universities. To reach 50% GER in the country, that goal can only be achieved through open universities, they brought to the attention of the meeting the points discussed by the officials of all open universities at the national level for two days.

Prof.R. Limbadri, Chairman, Telangana State Council for Higher Education, Government of Telangana who participated as the chief guest in this program said that Dr.B.R. Ambedkar Open University is the reason why the enrollment in Telangana is higher than the gross national average. It has been revealed that open universities will play a key role in increasing GER in the country in the coming days. He explained that not only the quantity of course material provided to the students but also the creation of quality courses is essential. He also explained that Dr.B.R.Ambedkar Open University is in the forefront in producing quality material. He called upon open universities to make special efforts to extend higher education to rural areas.

Prof. K. Seetharama Rao, in his closing remarks, narrated the ‘action plan’ taken so far and future course of action. He also elaborated the purpose of the OER fest and re-iterated that the target. He expressed his sincere thanks to CEMCA officials for their support.

Dr.Nirmal jeet Singh Kalsi, IAS (Retd) Chairmen, National Council for Vocational Education and Training (NCVET), New Delhi said that 50% credits can be obtained from skill courses. NCVET has created more than 7300 courses and suggested that open universities should focus on digital content creation, proper utilization and extensive use of ICT.

Prof. K. Nageshwar, Vice Chancellor, IGNOU, New Delhi said that if the open universities of the country are affiliated to the National Council for Vocational Education and Training (NCVET), they do not need the approval of AICTE. Students are not fully aware of Swayam Prabha channels and are advised to introduce this topic widely to the student world. He said that there are 40 Swayam Prabha channels while 4 channels are completely for employment training of students. These are available for the welfare of students from 2017.

Dr B. Shadrach, Director, Commonwealth Educational Media Centre for Asia (CEMCA), New Delhi, He welcomed all the vice-chancellor who have attended offline and online. He also presented a detailed reported of OER fest. He focused and highlight points by the officials of Open Universities in their presentations. He also expressed his sincere thanks to the experts of various institutions. The Vice Chancellors of open universities Prof. Amy Upadhyay (Gujarat); Prof. Karman Jeet Singh (Punjab); Prof. Sahu (Jharkhand); Prof. Sharanappa (Karnataka); Prof. R.P. Das (Assam); Prof. Sanjay Tiwari (Bhopal); Prof. AK Das Mahapatra (Bhubaneswar); Dr. Bans Gopal Singh (Chhattisgarh); Prof. Jagathi Raj (Kerala); Prof. Arumugam (Tamil Nadu); Prof. Om Prakash Singh Negi (Uttarakhand); Prof. Sanjeev Sonavani (Nashik); Prof. Devika Madalli (UGC New Delhi); senior officials of various national level educational institutions; Prof. G.Pushpa Chakrapani, Director Academic, BRAOU proposed vote of thanks. Prof.G. Lakshmi, Director COEL also participated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X