BJP Telangana President G Kishan Reddy’s Letter To Telangana Chief Minister Revanth Reddy, Subject…

Dear Shri Revanth Reddy Garu,

Greetings!

At the outset, I thank you for extending an invitation for the proposed “Praja Palana Dinotsavam” on September 17th.

As the son of this very soil, you are well aware that the people of Hyderabad Samsthan sustained a spirited struggle for years to liberate this region from the brutalities of the Nizam and his private army of Razakars. Many people laid down their lives in the process and thousands withstood unfathomable violence.

The liberation of Telangana is a heart wrenching story of courage, sacrifice and martyrdom. Therefore, we need to commemorate September 17th in a manner that befits the sacrifice of the martyrs. The purpose of such a commemoration ought to inspire the present generations with patriotic and nationalist fervour, and by informing them of the pristine history of the liberation.

Your intent however seems to be to deflect the attention of the people from the core aspects of the struggle which is evident in the very name given to the day. To describe the Liberation of Hyderabad, as just another transition of power from a monarchy to a democracy not only subverts the heroic struggle but also propagates further the politics of appeasement.

On the contrary, the Narendra Modi Government over the last few years has been commemorating September 17th by giving it the recognition that it deserves in a form and manner that pays homage to the courage, sacrifice and valour of those who made the liberation possible. I therefore cannot be party to an insincere ritual which blatantly attempts to erase the truth from the people.

I sincerely believe though that acknowledging September 17th as a day of immense significance is the first step in your journey to eventually understanding and accepting the truth of Liberation.

Warm regards
Yours sincerely,

(G. Kishan Reddy)

Shri A. Revanth Reddy,
Hon’ble Chief Minister,
Government of Telangana,
Dr. B.R. Ambedkar Telangana Secretariat,
6th Floor, Hyderabad – 500022, Telangana 

Also Read-

బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖ సారాంశం

గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నమస్కారములు,

సెప్టెంబర్ 17నాడు ప్రతిపాదిత ‘ప్రజాపాలన దినోత్సవాని’కి ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదములు.

నిజాం నవాబు ప్రైవేటు సైన్యమైన రజాకార్ల కిరాతక పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం స్వాతంత్ర్యం పొందేందుకు.. ఏళ్ల తరబడి పోరాడిన విధానం, రజాకార్ల హింసకు వేలమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి.. ఈ గడ్డపై పుట్టిన బిడ్డగా మీకు తెలుసు.

వారందరి వీరోచిత పోరాటం, నిస్వార్థ త్యాగం, హృదయవిదారక పరిస్థితులను ఎదుర్కొనడం, బలిదానం కావడం ఇదే మన తెలంగాణ చరిత్ర. అందుకే సెప్టెంబర్ 17నాడు.. ఆ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రస్తుత తరానికి మన పెద్దల ధైర్య, సాహసాలను తెలియజేసి జాతీయ భావన కల్పించాల్సిన అవసరం ఉంది. విమోచన చరిత్రను వారికి అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది.

ఇంతటి పవిత్రమైన, స్ఫూర్తిదాయకమైన రోజును, వేలాదిమంది త్యాగాల ఫలితమైన విమోచన దినోత్సవానికి.. పేరు మార్చి.. చరిత్రలో ఏమీ జరగలేదన్నట్లుగా, పరిపాలన నియంత రాజు నుంచి ప్రజాస్వామ్యానికి మారడం మాత్రమే జరిగిందన్నట్లుగా చెప్పడం.. వాస్తవ చరిత్రనుంచి ప్రజల దృష్టిని మరల్చడమేనని అర్థమవుతోంది. దీంతోపాటుగా తుష్టీకరణ రాజకీయాలను ప్రోత్సహించినట్లవుతోంది.

దీనికి భిన్నంగా, గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు.. గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ వీరుల త్యాగాలను స్మరించుకునేలా, వారికి ఘనంగా నివాళులు అర్పించేలా.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా, అధికారికంగా నిర్వహిస్తున్నారు.

అందుకే వాస్తవ, ఘనమైన తెలంగాణ చరిత్రను ప్రజల స్మృతిపథం నుంచి తుడిచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో నేను భాగస్వామిని కాలేను.

సెప్టెంబర్ 17వ తేదీ.. అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజుగా మీరు గుర్తించి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోవడం సంతోషకరం.. సమీప భవిష్యత్తులో వాస్తవాలను అర్థం చేసుకుని.. ఈ చరిత్రాత్మకమైన రోజును తెలంగాణ విమోచనం దినోత్సవంగా గుర్తిస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నాను.

ధన్యవాదములు

(జి.కిషన్ రెడ్డి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X