రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో బండి సంజయ్ భేటీ, ఖాజీపేట నుండి కరీంనగర్ కు కొత్త రైల్వే లేన్ నిర్మాణంపై ప్రతిపాదన

– ఖాజీపేట నుండి కరీంనగర్ కు కొత్త రైల్వే లేన్ నిర్మాణంపై ప్రతిపాదన

– డీపీఆర్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన అశ్వినీ వైష్ణవ్

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొద్ది సేపటి క్రితం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. న్యూఢిల్లీలో ఉన్న బండి సంజయ్ అశ్వీనీ వైష్ణవ్ కార్యాలయానికి వెళ్లి ఖాజీపేట(హసన్ పర్తి) నుండి కరీంనగర్ కు కొత్త రైల్వే లేన్ ను నిర్మించాలని కోరారు. దీంతోపాటు ఈనెల 8న వరంగల్ లో ఖాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, పీవోహెచ్ కు సంబంధించి భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అశ్వినీ వైష్ణవ్ బండి సంజయ్ తో చర్చించారు.

అనంతరం ఖాజీపేట(హసన్ పర్తి) నుండి కరీంనగర్ కు కొత్త రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు. సానుకూలంగా స్పందించిన అశ్వీనీ వైష్ణవ్ వెంటనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో బండి సంజయ్ తోపాటు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరాం, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X