హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోంది? అనేదానిపై ఎగ్జిట్ పోల్స్ (AP Exit Polls) క్లియర్ కట్‌గా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ప్రముఖ సర్వే, మీడియా సంస్థలు కూటమిదే గెలుపని తేల్చి చెప్పేశాయి. తాజాగా ఇండియా టుడే తన సంచలన సర్వేను రిలీజ్ చేసింది.
AP Exit Polls 2024 లో గెలిచేదెవరో తేల్చి చెప్పిన ఇండియా టుడే సర్వే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిదే అధికారం. సర్వేతో తేల్చి చెప్పిన ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా.
కూటమి టీడీపీ, జనసేన, బీజేపీకి 98-120 సీట్లు వస్తాయన్న సర్వే
టీడీపీకి : 78-96 సీట్లు
జనసేన : 16-18 సీట్లు
బీజేపీ : 04-06 సీట్లు
వైసీపీ : 55-77 సీట్లు
కాంగ్రెస్ : 0-2 సీట్లు
ఇది కూడ చదవండి-
కౌంటింగ్ రోజు ఘర్షణలు సృష్టించే అవకాశం
మరోవైపు ఏపీ సార్వత్రిక ఎన్నికలకు మే13వ తేదీన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే జూన్4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ చేయనున్నారు. ఈ మేరకు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ నేపథ్యంలో తెనాలిలో అల్లరి మూకలు ఘర్షణలు సృష్టించే అవకాశం ఉందని తనకు సమాచారం ఉందని తెలిపారు.
కౌంటింగ్‌లో ఇలాంటి వారి పట్ల ఎన్డీఏ కూటమి నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రశాంతతకు నెలవు తెనాలి ప్రాంతమని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు ఘర్షణ వాతావరణానికి దూరంగా ఉందామని అన్నారు. ఘర్షణలు సృష్టించడానికి ఎవరూ ప్రయత్నించిన ప్రభుత్వ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తెనాలికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.