అట్ట‌హసంగా ఏపీ బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యాల‌యం ప్రారంభం

ఏపీలో టిడిపి, వైసీపీలకు ప్ర‌త్యామ్నాయం బీఆర్ ఎస్సే
31 మంది ఎంపీలు ఉండి కేంద్రం నుంచి వైసీపీ ఏం సాధిచింది..?

  • పోల‌వ‌రం, రాజ‌ధాని నిర్మాణంలో ఆ రెండు పార్టీలు విఫ‌లం
  • ఏపీలో అభివృద్ధి శూన్యం, అప్పులు ఘ‌నం
  • అట్ట‌హసంగా ఏపీ బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యాల‌యం ప్రారంభం
  • బీఆర్ ఎస్ ఏపీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ తోట చంద్ర‌శేఖ‌ర్
  • వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హాజ‌రైన పార్టీ శ్రేణులు

హైదరాబాద్: ఆంధ్ర ప్ర‌దేశ్‌లో వైసీపీ, టీడీపీల‌కు బీఆర్ ఎస్సే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని భార‌త రాష్ట్ర స‌మితి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ తోట చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను ఆ రెండు పార్టీలు మోసగించయని తోట చంద్ర శేఖ‌ర్ విమ‌ర్శించారు. ఆదివారం గుంటూరు న‌గ‌రంలోని ఆటోన‌గ‌ర్ ప్రాంతంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన బీఆర్ ఎస్ రాష్ట్ర కార్యాల‌యాన్ని డాక్ట‌ర్ తోట అట్ట‌హ‌సంగా ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. పార్టీ కార్యాల‌యంలో పూజ‌లు చేశారు. అనంత‌రం జరిగిన తోట మాట్లాడుతూ టిడిపి ,వైసీపీ పార్టీలు రాష్ట్రాన్ని ఆథోగ‌తి పాలు చేస్తున్నాయని ఆందోళన వ్య‌క్తం చేశారు. టిడిపి వైఫ‌ల్యాల‌తో విసుగెత్తిన ప్ర‌జ‌ల‌కు మ‌రే ప్ర‌త్యామ్నాయం లేక వైకాపు ఓటు వేశారన్నారు.

అభివృద్ధి శూన్యం, అప్పులు ఘ‌నం అన్న చందంగా ఏపీ పరిస్తితి దయనీయంగా మారిందని వాపోయారు. ఆకాల వ‌ర్ఫాల‌తో అతాల‌కుత‌ల‌మైన రైతాంగానికి ప్రభుత్వం సాయ‌మందించ‌లేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు . 31 మంది ఎంపీలు ఉన్న‌ప్ప‌టికీ వైకాపా ప్ర‌త్యేక హోదా పై కేంద్రాన్ని నిల‌దిసిన దాఖ‌లాలు లేవన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటు ప‌రం చేస్తుంటే 31 మంది ఎంపీలు ఉండి ఏం మాట్లాడ‌టంలేద‌ని అన్నారు. మోదీ అంటే జ‌గ‌న్‌కు కేసుల భ‌య‌మ‌ని, చంద్ర‌బాబు మోదీతో పోత్తుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, కానీ సీఎం కేసీఆర్ మాత్ర‌మే మోదీని దీటుగా ఎదుర్కొంటున్నార‌ని, ఆయ‌న ను నిల‌దిసే స‌త్తా కేసీఆర్‌కే ఉంద‌న్నారు.

కేసీఆర్ కు ఒక్క తెలంగాణ‌, ఏపీ, మ‌హారాష్ట్ర‌ల‌కే కాద‌ని దేశం మొత్తానికి నాయ‌క‌త్వం వ‌హిస్తార‌ని అన్నారు. ఏపీకి బీఆర్ ఎస్ త‌రుఫున ఏపీకి చెందిన వారే సీఎం అవుతార‌నే విష‌యాన్ని గుర్తించుకోవాల‌న్నారు. ప్రైవేటు ప‌రం చేస్తున్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కేసీఆర్ ప్ర‌ధాని కాగానే వాటిని తిరిగి వెన‌క్కి తీసుకుంటామ‌ని బ‌హిరంగంగా ప్ర్ర‌కంటించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ దేశానికి నాయ‌క‌త్వం వ‌హించే స‌త్తా కేసీఆర్‌కు ఉంద‌న్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యం ఏమైంద‌ని వైకాపాను ప్ర‌శ్నించారు. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాలు ఏమ‌య్యాయ‌ని నిల‌దిశారు.

తెలంగాణ‌లో రైతుల కోసం ప్ర‌వేశ‌పెట్టిన రైతు బీమా, రైతు బంధు ప‌థ‌కాలు దేశ వ్యాప్తంగా రైతుల ఆద‌ర‌ణ‌ను పొందాయి. ఒక్క గుంట భూమి ఉన్న రైతు సైతం మ‌ర‌ణించిన వారం రోజుల్లో ఆ రైతు నామిని అకౌంట్లో 5 ల‌క్ష‌ల రూపాయ‌లు జ‌మ అవుతాయి. దేశంలోనే సీనియ‌ర్ నేత‌గా చెప్పుకునే చంద్ర‌బాబుకు ఏనాడైనా ఇలాంటి ఆలోచ‌న త‌ట్టిందా..? ఒక కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద మ‌ర‌ణిస్తే ఎంత ఇబ్బందులు ఉంటాయో తెలుసు కాబ‌ట్టే కేసీఆర్ గారు రైతు బీమా అమ‌లు చేస్తున్నారు. 5ల‌క్ష‌లు ఆ కుటుంబానికి త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నంగా ఉంటాయి. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ మోడ‌ల్ అభివృద్దిని ఏపీ ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.

బీఆర్ ఎస్ రాక‌తో టీడీపీ, వైసీపీ రెండు పార్టీల‌కు ప్ర‌జ‌లు బుద్ది చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల అనుభ‌వంలో ఉన్న ప‌థ‌కాలు ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తామ‌ని బీఆర్ ఎస్ జాతీయ అధ్య‌క్షుడు , తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారన్నారు. జీఎస్‌డీపీ, త‌ల‌సరి ఆదాయంలో దేశంలో తెలంగాణ ముందుంద‌న్నారు. కానీ ఏపీ మాత్రం ఎక్క‌డో ఉంద‌న్నారు.

అన్ని కులాలు, అన్ని మ‌తాల‌కు, అన్ని వ‌ర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ప‌థ‌కాలు రూపొందించారు. వాటిని అమ‌లు చేసి తీరుతారు. ఈ నేప‌థ్యంలో విజ్ఝులైన ఏపీ ప్ర‌జ‌లు అన్ని విధాలుగా ఆలోచించి మీకు మేలు చేసే బీఆర్ ఎస్‌ పార్టీని ఎన్నుకోవాల‌ని, ఆద‌రించాల‌ని బీఆర్ ఎస్ నూతన కార్యాల‌యం ప్రారంభం సంద‌ర్భంగా కోరుతున్నాను, విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. రానున్న కాలంలో బీఆర్ ఎస్ ఏపీలో రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం 1956 వ‌ర‌కు ప్ర‌త్యేరాష్ట్రంగా ఉంద‌ని, ఆ త‌రువాత ఆంధ్ర‌, తెలంగాణ‌లు క‌లిశాయ‌ని, ఆ య‌దాత‌ధ స్థితి ప్ర‌స్తుతం ఉంద‌ని, ఇందులో విడిపోవ‌డం ఏమి లేద‌న్నారు. గ‌తంలో హైద‌రాబాద్ రాష్ట్రంగా ఉండేద‌ని, 1948కి ముందు ప్ర‌త్యేక దేశంగా ఉండేద‌ని, అప్పుడు ధ‌నిక దేశంగా ఉండేద‌న్నారు.

హైద‌రాబాద్‌ను అంత‌ర్జాతీయ న‌గ‌రంగా రూపొందించ‌డంలో కేసీఆర్‌, కేటీఆర్ లు ఎంతో కృషి చేస్తున్నార‌ని, కానీ ఏపీలో ఒక్క న‌గ‌రం కూడా అభివృద్ధి చేయ‌డంలేద‌న్నారు. ఏపీకి స‌మ‌ర్ధ నాయ‌క‌త్వం లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే అనేక స‌మ‌స్య‌లు రాజ్య‌మేలుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. పార్టీలో చేరిక‌లు. పార్టీ రాష్ట్ర కార్యాల‌యం ప్రారంభం సంద‌ర్భంగా వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు, యువ‌కులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X