“కె టీ ఆర్ పాదయాత్ర చేసినా.. మీ దురాగతాలను ప్రజలు మరువరు”

కె టీ ఆర్ పాదయాత్ర ను ఎద్దేవా చేసిన ఏ ఐ సి సి సభ్యురాలు, టీ పి సి సి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ

హైదరాబాద్ : ప్రజాభిమానం కోల్పోయి, అధికారానికి దూరమైన బి ఆర్ ఎస్ పార్టీ మనుగడ కోసం అడుగులు వేస్తోందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు, టీ పి సి సి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ విమర్శించారు. బి ఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కే టీ ఆర్ గురువారం సూర్యపేట లో మాట్లాడిన తీరు సరికాదన్నారు. పదేళ్ల టీ ఆర్ ఎస్ అధికార కాలం లో ప్రజల సొమ్ముకు జవాబు దారీ తనం లేకుండా వ్యవహరించారనీ, అందుకే ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం ఎదురైందన్నారు.

అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాతైనా బి ఆర్ ఎస్ తన స్థాయిని గుర్తిస్తుందని ఆశించామని, అయితే మరింత బరితెగించి వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. కే టీ ఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కి డబ్బు సంచులు మోస్తున్నారని, ఆయనను బి జె పి కాపాడుతోందని పేర్కొనడం అందుకు నిదర్శనం అన్నారు. కెసిఆర్ లేకపోతే తెలంగాణా లేదనడం కేటీర్ కరడుకట్టిన అహంకారానికి నిదర్శనమని డాక్టర్ నీలిమ విమర్శించారు.

Also Read-

ఓక పధకం ప్రకారం బి ఆర్ ఎస్ బీజేపీ కి దగ్గరవుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎం ఎల్ సి ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రత్యక్షంగా బి జె పి కి మద్దతుగా నిలిచిన విషయం ప్రజలు మరచి పోలేదన్నారు. మూడు లక్షల కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ ప్రవేశపెడితే.. అందులోనూ తప్పులు వెతికిన ప్రతిపక్షాలకు విమర్శలు తప్ప ప్రజా సంక్షేమం పట్టటం లేదన్నారు. 15 నెలలుగా ప్రజలకు కనపడని కే సి ఆర్ ప్రజా పాలన గురించి మాట్లాడటం విడ్డూరమ్మన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X