ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో జరిగిన వాయిస్ ఆఫ్ మీడియా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ పాత్రికేయ బృందం

హైదరాబాద్/ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో వైస్ ఆఫ్ మీడియా యొక్క జాతీయ సదస్సు శుక్రవారం నిర్వహించగా తెలంగాణ పాత్రికేయ బృందం పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పార్లమెంట్ సభ్యులు సంజయ్ రావత్ పాల్గొనడం జరిగింది.

సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న మీడియా పాత్రికేయులు తమ తమ ఆలోచనలను వ్యక్తీకరించారు. పాత్రికేయుల పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్, పాత్రికేయులకు స్వగృహం, పదవీనంతర జీవితం ఇలా ఉండాలనేది చర్చించడం జరిగింది.

సమావేశము నందు వాయిస్ ఆఫ్ మీడియా జాతీయ అధ్యక్షులు సందీప్ కాలే, జాతీయ ఉపాధ్యక్షులు ఫిరోజ్ పింజారి, జాతీయ ప్రధాన కార్యదర్శి దివ్యబోస్లే కలసి వివిధ రాష్ట్ర అధ్యక్షులను నియమించి వారికి పదవి బాధ్యతలను అప్పగించారు.

తెలంగాణ వాయిస్ ఆఫ్ మీడియా అధ్యక్షులుగా సందేశ్ భరద్వాజ్, ఉపాధ్యక్షులుగా మొహమ్మద్ మోహసిన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా టి రవీందర్, డాక్టర్ పద్మాకర్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా మహమ్మద్ షఫీ ని నియమించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X