ఫ్రుగల్ ఏఐపై అంతర్జాతీయ సదస్సులో డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రతినిధులు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్న ఆన్‌లైన్ కోర్సులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు భౌగోళిక పరిమితులు లేకుండా అభ్యసించేనుందుకు అవకాశం కల్పిస్తునున్నట్లు ఆ యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.జి.పుష్పా చక్రపాణి పేర్కొన్నారు. ఇందులో బి.కాం., ఎం.కాం., ఎం.బి.ఏ., ఎం.ఏ. తెలుగు తదితర ఆన్‌లైన్ కోర్సులు ఉన్నాయని వవరించారు. కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (సీఓఎల్ – కెనడా), ఓపెన్ యూనివర్సిటీ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో “విద్యలో ఫ్రుగల్ ఏఐ” (Frugal AI in Education) అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ వర్క్‌షాప్‌లో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓయూ) ప్రతినిధులు పాల్గొన్నారు.

అకడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్ప చక్రపాణి, ఎడ్‌టెక్ మేనేజర్ శ్రీమతి సుషుమ్న రావు ఈ వర్క్‌షాప్‌లో విశ్వవిద్యాలయం తరఫున ప్రతినిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి “స్మాల్ మోడల్స్, బిగ్ పాజిబిలిటీస్ – ఎక్స్‌ప్లోరింగ్ ఫ్రుగల్ ఏఐ ఎట్ బీఆర్‌ఏఓయూ” (చిన్న నమూనాలు – అపార అవకాశాలు: బీఆర్‌ఏఓయూలో ఫ్రుగల్ ఏఐ అన్వేషణ) అనే అంశంపై ప్రసంగించారు. మలేషియా, వనువాటు, మారిషస్, సమోవా తదితర దేశాల ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని తమ పరిశోధనాత్మక ఆలోచనలను పరస్పరం పంచుకున్నారు. భవిష్యత్తులో ఆయా యూనివర్సిటీ లతో కలిసి పనిచేసేందుకు గల అవకాశాలపై చర్చించారు.

మలేషియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం

మలేషియాలో నిర్వహించిన సెమినార్‌లో పాల్గొనడానికి వెళ్లిన డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొ. జి. పుష్ప చక్రపాణి, మలేషియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అందిస్తున్న ఆన్‌లైన్ కోర్సుల వివరాలను వారికి వివరించారు. ఈ కోర్సుల ద్వారా తెలుగు వారు తమకు అనుకూలమైన ప్రదేశం నుంచి ఉన్నత విద్యను అభ్యసించవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్ విద్య ద్వారా ఉన్నత విద్యను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఉన్నత విద్య అవకాశాలను చేరువ చేయడమే లక్ష్యంగా డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ముందుకెళ్తోందని ఆమె వివరించారు.

Also Read-

ఈ సందర్భంగా మలేషియా తెలుగు అసోసియేషన్ ప్రతినిధి సత్యా సుధాకరన్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం మలేషియాలో నివసిస్తున్న తెలుగు వారితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మలేషియాలోని తెలుగు వారందరికీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్‌లైన్ కోర్సుల వివరాలను చేరవేసి, ఆసక్తి ఉన్నవారిని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహిస్తామని సత్యా సుధాకరన్‌ తెలిపారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ టెక్నికల్ నిపుణురాలు శ్రీమతి సుషుమ్న రావు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar