హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మారగాని శ్రీనివాస్ రావు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈ నెల 4వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేశారు.
ప్రతి ఏటా హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మారగాని శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం తెలుగు రాష్ట్రాల ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఏటా ఈ మహోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించేందుకు హరిహర ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు.
Also Read-
మహేష్ కుమార్ గౌడ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు, నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

One thought on “భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి మహేష్ కుమార్ గౌడ్‌కు ఆహ్వానం”