సికింద్రాబాద్: ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడరేషన్ (AIRRF) ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీ నుండి సికింద్రాబాద్‌లోని చిలకలగూడ ఏఐఆర్ఆర్ఎఫ్ కార్యాలయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్) క్యాంపైన్ 5.0ను నిర్వహించారు. రైల్వే పింఛనుదారులు బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా సులభంగా తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ నమోదు చేసుకునేలా ఈ కార్యక్రమం చేపట్టారు.
Also Read-

ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏజీఎం సత్యనారాయణ, బ్యాంక్ అధికారి రామయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 80 ఏళ్లు పైబడిన పలువురు వయోవృద్ధ రైల్వే పెన్షనర్లు ఈ క్యాంప్‌లో పాల్గొని తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు.
Also Read-
ఈ కార్యక్రమానికి ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్, జోనల్ సెక్రటరీ శివకుమార్ నాయకత్వం వహించారు. ఆఫీస్ బేరర్లు అనిల్ కుమార్, స్వామి, నాగరాజు, గోపాల్ నాయుడు, విజయ్ కుమార్, విల్సన్, బర్నార్డ్, మాధవరావు, ముత్తయ్య తదితరులు పాల్గొని వయోవృద్ధులకు అవసరమైన సేవలు అందించారు.

One thought on “AIRRF ZINDABAD ! డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపైన్ 5.0 ప్రారంభం”