కార్గిల్ విజయ్ దివస్, అమరవీరులకు నివాళులు అర్పించిన ఎన్ రాంచందర్ రావు

హైదరాబాద్ : కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లోని వీరుల సైనిక స్మారక వద్ద అమరవీరులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు ఘన నివాళులు అర్పించారు.

కార్గిల్ విజయ్ దివస్ భారత సైన్యం యొక్క అజేయ ధైర్యానికి, అసమాన పరాక్రమానికి, చెక్కుచెదరని సంకల్పానికి, దేశం పట్ల ఉన్న అత్యున్నత అంకితభావానికి ప్రతీక. కార్గిల్‌లోని దుర్భేద్యమైన శిఖరాలపై మన వీర జవాన్లు అసాధారణ శౌర్యాన్ని ప్రదర్శించి, త్రివర్ణ పతాక గౌరవాన్ని, దేశ ప్రతిష్ఠను కాపాడుతూ విజయగాథలో సువర్ణాధ్యాయాన్ని లిఖించారు.

ఈ పవిత్ర సందర్భంలో మాతృభూమి రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్లకు వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాను. దేశ సరిహద్దులను అహర్నిశలు కాపాడుతున్న మన వీర సైనికులందరికీ శిరసు వంచి వందనం చేశారు.

ఇది కూడ చదవండి-

మన వీరపుత్రుల త్యాగం, అమరత్వం, దేశం పట్ల వారి అపూర్వ అంకితభావం ప్రతి భారతీయుడిలో, ముఖ్యంగా యువతలో, దేశభక్తిని, జాతీయ సేవాభావాన్ని తరతరాలకు ప్రేరేపిస్తూనే ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X