హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజు హర్యానా, చండీగఢ్ మరియు పంజాబ్ రాష్ట్రాలలో పర్యటించి, దేశవ్యాప్తంగా సుమారు రూ.25,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో భాగంగా నరేంద్ర మోదీ ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద తెలంగాణలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌తో సహా మొత్తం 75 పునరాభివృద్ధి చేయబడిన రైల్వే స్టేషన్లను జలంధర్ రైల్వే స్టేషన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

జలంధర్ స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా కేంద్ర రైల్వే, సమాచార మరియు ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు కేంద్ర రైల్వే మరియు ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవణిత్ సింగ్ కూడా పాల్గొన్నారు.

అదే సమయంలో, హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో కూడా జరిగిన కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఎ.వి.ఎన్.రెడ్డి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్.రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ శుభ సందర్భంలో భాగం కావడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశం అద్భుతమైన పురోగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. గతంతో పోలిస్తే దేశంలో రైలు ప్రయాణం భారీ రూపాంతరం చెందిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్రంలో రూ. 40,000 కోట్లకు పైగా విలువైన రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, రోడ్డు, రైలు లేదా విమానయాన రంగాల ద్వారా రవాణా అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆయన చెప్పారు. మధ్యతరగతి ప్రజల అవసరాలను తీర్చే విధంగా రైల్వేల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతోందని ఆయన పేర్కొన్నారు.

Also Read-

అంతకుముందు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ స్వాగతోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లను ప్రారంభించడం ఒక చిరస్మరణీయ సందర్భమని, వాటిలో దక్షిణ మధ్య రైల్వేపరిధిలోనున్న హై-టెక్ సిటీ స్టేషన్ ఒకటిగా నిలవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను కొత్త స్టేషన్ భవనం, మెరుగైన వెయిటింగ్ హాల్స్, సైనేజ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, దివ్యాంగజన సౌకర్యాలు వంటి ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో పునరాభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. తెలంగాణలోని మిగిలిన స్టేషన్లలో పునరాభివృద్ధి పనులు షెడ్యూల్ ప్రకారం పురోగమిస్తున్నాయని ఆయన ఇంకా తెలిపారు. గణనీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, వేగవంతమైన విద్యుదీకరణ, ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో తెలంగాణ రాష్ట్రం రైల్వే మౌలిక సదుపాయాల పరివర్తనలో కీలక పాత్ర పోషించిందని జనరల్ మేనేజర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, ప్రముఖులు జంట నగరాల పరిధిలోని ఆరు పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం మరియు పెయింటింగ్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. “నా నగరంలో అభివృద్ధి చెందిన రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది?” మరియు “అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి నేను ఏమి చేస్తాను?” అనే అంశాలపై ఈ పోటీలు జరిగాయి. అలాగే, పునరాభివృద్ధి చేయబడిన హైటెక్ సిటీ ‘అమృత్ స్టేషన్’ రూపాంతరాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సెల్ఫీ పోటీ విజేతలకు కూడా బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిగిన సాంస్కృతిక మరియు జానపద నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ నుండి, జింద్ మరియు సోనిపత్ మధ్య భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు. ప్రధానమంత్రి జింద్ మరియు హర్యానాలు చరిత్ర పుటలలో తమ పేర్లను శాశ్వతంగా లిఖించుకున్నాయని పేర్కొన్నారు. పూర్తిగా కాలుష్య రహితమైన ఈ హైడ్రోజన్ రైలు, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఒక అద్భుతమైన విజయవంతమైన నిదర్శనంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar