డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఐదు కొత్త కోర్సులకు యూజీసీ అనుమతి, ఆ కొత్త కోర్సులు ఏమిటో తెలుసుకోండి…

హైదరాబాద్ : డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)కి కొత్తగా ఐదు కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపిందని విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఈ ఐదు కోర్సులకు ప్రొఫెషనల్ మరియు అకాడమిక్ రంగాల్లో ఎక్కువ డిమాండ్ ఉందని వివరించారు. . కొత్తగా యూజీసీ ఆమోదం తెలిపిన కోర్సుల్లో…: M. A. ఎడ్యుకేషన్; M. A. ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్); మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW); M.Sc. భౌగోళిక శాస్త్రం (Geography) ; B. Ed. (స్పెషల్ ఎడ్యుకేషన్ – అనుమతి పునరుద్ధరణ) ఉన్నాయని ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు.

యూజీసీ ఎక్సపెర్ట్ కమిటీ జూన్‌లో వర్చువల్ గా తనిఖీ చేశారని, యూనివర్సిటీ లో ఉన్న మౌళిక వనరులను, అధ్యాపక సిబ్బంది, ఇతర అన్ని అంశాలను పరిశీలించారని ఆ తర్వాత పైన పేర్కొన్న ప్రోగ్రామ్స్‌ను ఆమోదించారని వెల్లడించారు. ఈ కొత్త కోర్సులకు అనుమతి రావడంలో తెలంగాణ ప్రభుత్వ తోడ్పాటు ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి డా. యోగిత రాణా, ఐఏఎస్, రాష్ట్రంలోని టీచర్లకు ఓపెన్ మరియు డిస్టెన్స్ లర్నింగ్ ద్వారా ప్రత్యేక ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశ్యం తో కోర్సులను రూపొందించగా యూజీసీ వాటికి ఆమోదం తెలిపిందని వివరించారు. రాష్ట్రంలో టీచర్ల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక విద్యా ప్రోగ్రామ్స్ అందించాలని డా. యోగిత రాణా, ఐఏఎస్ సూచించారని పేర్కొన్నారు. పై కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆమోదం పొందిన నేపధ్యంలో విద్యా శాఖ కార్యదర్శి డా. యోగిత రాణా, ఐఏఎస్ కు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు ప్రొ. ఘంటా చక్రపాణి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Vice-Chancellor Prof. Ghanta Chakrapani

ఎమ్.ఎ. (ఎడ్యుకేషన్), ఎమ్.ఎ. (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), మరియు బి. ఇ.డి. (సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల కోసం) రాష్ట్రంలో విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తమ అర్హతలను మెరుగుపరచుకోవడానికి, న్యాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి, స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందడానికి విధి నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయని ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణను అందించే విషయమై త్వరలోనే తెలంగాణ విద్యా శాఖతో అవగాహనా ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW) మరియు భౌగోళిక శాస్త్రం (Geography)లో M.Sc. ప్రోగ్రామ్స్ అత్యంత డిమాండ్ ఉన్న పీజీ కోర్సులు అని తెలిపారు.

Also Read-

యూజీసీ కొత్తగా ఆమోదం తెలిపిన ఈ కోర్సుల కోసం కనీస అర్హత, అడ్మిషన్ విధానం, ఫీజుల వివరాలు, కోర్సు వ్యవధి, స్టడీ సెంటర్లు వివరాలతో విశ్వవిద్యాలయం త్వరలో అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని వివరించారు. తాజా సమాచారం కోసం విద్యార్థులు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ www.braou.ac.in లేదా www.braouonline.in ను సందర్శించాలని, లేదా హెల్ప్ డెస్క్ 040 – 23680 333 / 555 లో సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X